Clove tea: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే.. సర్వరోగాలన్నీ మటాష్!

లవంగాలతో చేసిన టీ తాగితే రోగనిరోధకశక్తి పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి లవంగాల టీ తాగితే శరీర ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 29, 2024 9:30 pm

Clove Tea

Follow us on

Clove tea: వాతావరణంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు వల్ల కొందరు అనారోగ్యం బారిన  పడుతుంటారు. ముఖ్యంగా శీతాకాలం అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న జలుబు, దగ్గు, గొంతు సమస్యలు వెంటాడుతాయి. వీటికి తోడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం కాకుండా బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సీజన్ వస్తే చాలు ఇక.. రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తుంటాయి. కాస్త జలుబు చేసే చాలు.. ఇక ఫీవర్, దగ్గు అన్ని వచ్చి ఎన్ని రోజులైన కూడా తగ్గదు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం పూట పోషకాలు ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. దీనివల్ల ఎలాంటి రోగాలైన కూడా నయం అయిపోతాయి. రోజంతా ఫ్రెష్‌గా ఉండటానికి కొందరు ఉదయం పూట టీ లేదా కాఫీ తాగుతుంటారు. దీనికి బదులు లవంగాలతో చేసిన టీ తాగితే రోగనిరోధకశక్తి పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి లవంగాల టీ తాగితే శరీర ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పిత్త సమస్యల నుంచి విముక్తి
కొందరు పిత్త సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా కడుపు, గొంతు సమస్యలతో బాధపడుతుంటారు. దీనివల్ల జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. ఇలాంటి వారు లవంగాల టీని తాగడం వల్ల ఈ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందుతారు. రోజూ ఉదయం పూట పరగడుపున లవంగాల టీ తాగడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. దీంతో కడుపులో మంట, అసిడిటీ తగ్గుతాయి. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం
ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగం నీటిని తాగితే జీర్ణవ్యవస్థ బలంగా తయారవుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం వంటి కడుపు వ్యాధులు కూడా నయం అవుతాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. లవంగాలలోని పోషకాలు ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. దీంతో ఈ సమస్యల నుంచి విముక్తి చెందుతారు.

బాడీ హైడ్రేట్
కొందరి బాడీ కారణం లేకుండా వేడిగా అవుతుంది. దీంతో కడుపులో మంట, మలబద్దకం వస్తాయి. ఈ సమస్యల నుంచి విముక్తి చెందాలంటే లవంగాల టీను ఉదయం పూట తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. లవంగం టీ వల్ల బాడీకి చల్లదనం లభిస్తుంది. దీంతో కడుపు మంట నుంచి విముక్తి పొందుతారు.

బరువు తగ్గడంలో సహాయం
ఉదయం ఖాళీ కడుపుతో లవంగం టీని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఈ టీ వల్ల తొందరగా బరువు కూడా తగ్గుతారు. ఈ టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారు లవంగాల టీని తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

రోగనిరోధక శక్తిని పెరుగుతుంది
లవంగం టీ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. డైలీ ఉదయం పూట ఈ లవంగాల టీ తాగడం వల్ల తక్షణమే శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. లవంగాల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.