Health news – Pillows : ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన నిద్ర చాలా అవసరం. అప్పుడు మాత్రమే ఆరోగ్యం బాగుంటుంది. సరైన నిద్ర లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక నిద్ర పోవాలి అంటే తలకింద దిండు ఉండాల్సిందే. అలాంటి ఇలాంటి దిండు ఉంటే కూడా సరిపోదు. మంచి దిండు ఉంటేనే హాయిగా అనిపిస్తుంది. ఇంతకీ ఎలాంటి దిండు పెట్టుకోవాలి. దిండు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కరెక్ట్ పొజిషన్ లో పడుకుంటే కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి తగ్గుతుంది. ఇక కుడివైపు కంటే ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని భావిస్తారు నిపుణులు. ఎందుకంటే ఎడమ వైపు పడుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవడంతో పాటు అనేక ప్రయోజనాలున్నాయి. ఇక పొజిషన్ మాత్రమే కాదు తలకింద సరైన దిండు కూడా ముఖ్యమే. కొందరికి ఎత్తైన దిండు పెట్టుకొని అలవాటు ఉంటుంది. కానీ ఇలా పడుకోవడం వల్ల కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి మొదలవుతుంది.
కొందరు మెడ నొప్పి కోసం మందులు వాడతారు. మీ దిండును మార్చకపోతే ఎన్ని మందులు వాడినా కూడా ప్రయోజనం ఉండదట. ఇక కొంతమందిలో ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పి వస్తుంది. ఇక మీరు తలకింద దిండు పెట్టుకోవడం వల్ల మాత్రమే ఈ సమస్య వస్తుంది. ఇలా రోజూ చేయడం వల్ల వెన్నెముక వంగిపోతుందట. వెన్నుముక డిస్క్‌లలో దూరం పెరిగి వెన్ను నొప్పి మరింత పెరుగుతుందట. ఇక ఎత్తైన దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీని వల్ల తరచూ తలనొప్పి వస్తుంది.
గంటల పాటు ఎత్తైన దిండు పెట్టుకోవడం వల్ల రక్త సరఫరా సరిగా జరగక జుట్టుకు సరైన పోషణ కూడా లభించదు. ఇలా పెట్టుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. ఇది మాత్రమే కాకుండా శరీరంలోని కొన్ని భాగాలకి రక్త సరఫరా సరిగ్గా అందదట. దీని వల్ల తిమ్మిర్ల సమస్య వస్తుంటుంది. ఇలాంటి సమస్యలు రావద్దు అంటే ఎత్తైన దిండు కాకుండా చిన్న దిండు పెట్టుకోవాలి. అంతేకాదు మెత్తని దిండు కూడా పెట్టుకోవాలి. దీని వల్ల మీరు చాలా సమస్యల నుంచి దూరం అవుతారు.