Green Tea: గత కొన్నేళ్లలో గ్రీన్ టీ తాగేవాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే. బరువు తగ్గాలనే ఆలోచనతో చాలామంది గ్రీన్ టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. కరోనా విజృంభణ తర్వాత గ్రీన్ టీ తాగేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అయితే గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి. గ్రీన్ టీలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
గ్రీన్ టీలో ఇతర టీలతో పోల్చి చూస్తే కెఫీన్ తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల డీ హైడ్రేషన్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పరగడుపున గ్రీన్ టీ తాగేవాళ్లను ఐరన్ లోపం, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్నిసార్లు గర్భస్రావానికి గ్రీన్ టీ కారణమయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు.
ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల ఆకలి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వల్ల కడుపులో మంట, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. గ్రీన్ టీ తాగేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.