https://oktelugu.com/

Bigg Boss 8 Teluguలోకి సిద్దిపేట నటుడు.. పెళ్లిచూపులతో హిట్.. తర్వాత ఫట్.. అభయ్ నవీన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

ఇక పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ ఆయనకు సరిపడా క్యారెక్టర్ దొరకడం లేదు. దానివల్ల ఆయన చాలావరకు సినిమాలను రిజెక్ట్ చేస్తూ వస్తున్నాడట. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షో లో ఎలాగైనా సరే గెలిచి మళ్లీ అవకాశాలను అందుకోవాలని చూస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : September 1, 2024 / 11:44 PM IST

    Background of Abhay Naveen who entered Bigg Boss 8 Telugu

    Follow us on

    Bigg Boss 8 Telugu : సినిమా ఇండస్ట్రీ లో రాణించడం అంటే అంత ఈజీ కాదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా వాళ్ళని వాళ్ళు నటులుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటు రావాలి. అయితే కొంతమంది ఇండస్ట్రీ లో ఎదగలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకుంటారు. అలాగే వాళ్ల సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు…

    ప్రస్తుతం బిగ్ బాస్ షో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఇక అందులో భాగం గానే కంటెస్టెంట్ ని ఎంపిక చేయడంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని మరి కంటెస్టెంట్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ‘అభయ్ నవీన్ అనే ఒక సినిమా కంటెస్టెంట్ ని కూడా సెలెక్ట్ చేశారు. నిజానికి అభయ్ నటుడు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో తన ఊరుని సైతం వదిలేసి ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన అన్నపూర్ణ స్టూడియోలో ఫిలిం కోర్స్ ని కూడా కంప్లీట్ చేసి సినిమా అవకాశాల కోసం వెతుకుతూ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తూ తన కెరీర్ ని ముందుకు సాగించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. అయితే అభయ్ మొదట్లో తన సొంత ఊరు అయిన సిద్దిపేట లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి పేరు దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు…

    అప్పటినుంచి ఆయన వెను తిరిగి చూడకుండా సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. నటుడు ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టడం కూడా ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి. మరి ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూనే టైటిల్ గెలవడానికి తన వంతు ప్రయత్నం అయితే చేస్తానని చెప్పాడు. ఇక అభయ్ నవీన్ జార్జ్ రెడ్డి సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో నటించాడు.

    దాంతో ఆయనకు చాలా మంచి నటుడుగా గుర్తింపురావడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి… ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బిగ్ బాస్ హౌస్ లో చాలా చురుగ్గా పాల్గొని ఎలాగైనా సరే టైటిల్ ని గెలుచుకొని తనను తాను స్టార్ యాక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

    ఇక పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ ఆయనకు సరిపడా క్యారెక్టర్ దొరకడం లేదు. దానివల్ల ఆయన చాలావరకు సినిమాలను రిజెక్ట్ చేస్తూ వస్తున్నాడట. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షో లో ఎలాగైనా సరే గెలిచి మళ్లీ అవకాశాలను అందుకోవాలని చూస్తున్నాడు. ఆయన చేయబోయే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా గుర్తింపు ఉన్న పాత్ర అయితేనే చేస్తారట. లేకపోతే చేయకుండా ఉండడానికే తను సిద్ధంగా ఉన్నానని గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో తెలియజేశాడు…