House Wife : స్త్రీలు స్నానం చేయకుండా ఈ పనులు చేస్తే అష్టదరిద్రమే

ఇంటిని శుభ్రం చేసే గృహిణి ఉదయం నిద్ర లేవగానే స్నానాది కార్యక్రమాలు పూర్తిచేసి వంటింట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఉరుకుల పరుగుల జీవితంలో పరిశుభ్రతను పక్కన పెట్టేశారు. స్నానం చేశాకే పనులు చేయాలనే నియమాన్ని పాటించడం లేదు. ఫలితంగా దారిద్ర్యం వెన్నంటే ఉంటుంది.

Written By: Srinivas, Updated On : July 20, 2023 7:36 pm
Follow us on

House Wife : ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇల్లాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. లేకపోతే ప్రతికూలతలే చోటుచేసుకుంటాయి. ఇంటిని శుభ్రం చేసే గృహిణి ఉదయం నిద్ర లేవగానే స్నానాది కార్యక్రమాలు పూర్తిచేసి వంటింట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఉరుకుల పరుగుల జీవితంలో పరిశుభ్రతను పక్కన పెట్టేశారు. స్నానం చేశాకే పనులు చేయాలనే నియమాన్ని పాటించడం లేదు. ఫలితంగా దారిద్ర్యం వెన్నంటే ఉంటుంది. మన పూర్వీకులు స్నానం పూర్తి చేశాకే పనులు చేసుకోవాలనే నిబంధన పెట్టారు. నేడు దాన్ని విస్మరిస్తున్నారు.

తులసిని తాకకూడదు

మహిళలు స్నానం చేయకుండా తులసి చెట్టును తాకకూడదు. దానికి నీళ్లు పోయకూడదు. స్నానం చేశాకే ఆ చెట్టును తాకి నీళ్లు పోసి పూజలు చేయాలి. అంతే కాని స్నానం చేయకుండా ఆ చెట్టును తాకడం వల్ల పాపం చుట్టుకుంటుంది. తులసిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చెబుతుంటారు. అందుకే స్నానాదులు చేయకుండా దాన్ని తాకడం అంత మంచిది కాదని అంటున్నారు.

వంటింట్లోకి వెళ్లరాదు

మహిళలు స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్లకూడదు. వంట చేసే పొయ్యిని కూడా లక్ష్మీదేవిగా కొలుస్తుంటాం. అందుకే స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్లడం, వంట చేయడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి మహిళ స్నానం చేశాకే వంటింట్లోకి వెళ్లి వంటకు సంబంధించిన పనులు చేసుకోవచ్చు. స్నానం చేయకుండా వెళ్లొద్దు.

తల దువ్వకూడదు

చాలా మంది ఇంట్లో వెంట్రుకలు విరబోసుకుని ఉంటారు. అలా ఉండకూడదు. ఇంట్లో జుట్టు విప్పకూడదు. దువ్వకూడదు. జుట్టు దువ్వుకోవాలంటే స్నానం చేసిన తరువాత మాత్రమే దువ్వుకోవాలి. అది కూడా ఇంట్లో కాదు. ఇంటి బయట జుట్టు దువ్వుకోవాలి. కొందరు నడింట్లోనే జుట్టు దువ్వుతుంటారు. ఇది కరెక్టు కాదు. దారిద్ర్యం పట్టుకుంటుంది. లక్ష్మీ కటాక్షం కావాలంటే ఇంట్లో జుట్టు దువ్వడం సరైంది కాదు.

డబ్బు లెక్కపెట్టడం

స్నానం చేయకుండా డబ్బు ముట్టుకోకూడదు. లెక్కపెట్టకూడదు. స్నానం చేశాక డబ్బు ముట్టుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు. డబ్బు కింద పడినా, కాళ్లకు తగిలినా చేతితో తీసుకుని కళ్లకు హత్తుకుని నమస్కారం చేసి తీసుకుంటాం. లక్ష్మీదేవికి ప్రతిరూపమైన డబ్బును స్నానం చేయకుండా తాకడం మంచిది కాదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి కష్టాల పాలు కావడం జరుగుతుంది.