ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నామనే సంగతి తెలిసిందే. మహిళలను ప్రస్తుత కాలంలో ఎక్కువగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మహిళలు ఈ ఆరోగ్య సమస్య బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. వివాహమైన తర్వాత సంతానం లేకపోవడం వల్ల కొంతమంది మహిళలు బాధ పడుతుంటారు.
థైరాయిడ్ తో బాధ పడుతూ గర్భం దాల్చిన మహిళలు థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్ ను చేయించుకోవాలి. మహిళలు థైరాయిడ్ ను అదుపులో ఉంచుకోకపోతే పుట్టబోయే బిడ్డకు అవయవాలకు సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొన్నిసార్లు కడుపులో పిండం ఎదగకుండా బిడ్డ చనిపోయే అవకాశాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
థైరాయిడ్ తో బాధ పడే మహిళలు వైద్యుల సూచనలు మేరకు మందులు వాడాలి. అలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జన్మించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.