https://oktelugu.com/

Rajini Kanth: పెద్దన్న సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన రజినీ కాంత్…

Rajini Kanth: సూపర్​స్టార్ రజనీకాంత్ దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. రజనీకి తమిళంతో పాటు, తెలుగు లో కూడా ఉన్నఇమేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. కాగా ఇటీవల ‘పెద్దన్న’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు రజినీ. అయితే ఈ సినిమా గురించి రజని ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రజినీ కుమార్తె సౌందర్య ఇటీవల ‘హూటే’ అనే యాప్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 16, 2021 / 05:29 PM IST
    Follow us on

    Rajini Kanth: సూపర్​స్టార్ రజనీకాంత్ దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. రజనీకి తమిళంతో పాటు, తెలుగు లో కూడా ఉన్నఇమేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. కాగా ఇటీవల ‘పెద్దన్న’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు రజినీ. అయితే ఈ సినిమా గురించి రజని ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రజినీ కుమార్తె సౌందర్య ఇటీవల ‘హూటే’ అనే యాప్​ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రజినీకాంత్ ఆ యాప్ లో రెండు వాయిస్​ మెసేజ్​లు పోస్ట్ చేశారు.

    గతంలో రజనీకాంత్ “పేటా” తో పాటే అజిత్ నటించిన “విశ్వాసం” కూడా థియేటర్లలో రిలీజైంది. ఆ సమయం లోనే ‘విశ్వాసం’ రజనీకి తెగ నచ్చేసిందట. దీంతో ఆ సినిమా డైరెక్టర్​ శివను కలవాలనుకున్నానని రజినీకాంత్ వెల్లడించారు. దీంతో అతడిని తన ఇంటికి పిలిపించి సినిమా చేసే విషయమై మాట్లాడగా మీకు హిట్​ ఇవ్వడం చాలా సులభం సర్ అని తనతో శివ అన్నట్లు రజనీ గుర్తు చేసుకున్నారు. తనతో ఇప్పటివరకు ఏ డైరెక్టర్​ కూడా అలా అనలేదని… అయితే హిట్​ ఇస్తా అని ఎలాంటి నమ్మకంతో చెబుతున్నావని అడిగారన్నారు. మంచి కథతో పాటు గ్రామీణ నేపథ్యంలో మీరు సినిమా తీసి చాలా రోజులైంది. ఆ రెండు ఉంటే సినిమా కచ్చితంగా హిట్​ అవుతుంది అని శివ తనతో అన్నాడని రజనీ చెప్పారు.

    రజనీని కలిసిన 20 రోజుల తర్వాత శివ పూర్తి స్క్రిప్ట్​తో వచ్చాడని… దాదాపు రెండున్నర గంటలపాటు తనకు నెరేషన్ ఇచ్చాడని తెలిపారు. వెంటనే పెద్దన్న స్క్రిప్ట్​కు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చానని రజనీ అన్నారు. అయితే శివ ఈ కథ చెబుతున్న సమయంలో తెలియకుండానే ఏడ్చేశానని రజనీ చెప్పడం విశేషం. ఆ తర్వాత కధ చాలా బాగుంది నువ్వు చెప్పినట్లు తీయ్ చాలు అని శివతో చెప్పానని రజనీ తెలియజేశారు. ఇంత కంటే బాగా తీస్తాను ప్రేక్షకులు చాలా మంది వచ్చి ఈ సినిమా చూస్తారు అని శివ తనతో అన్నాడన్నారు.