Phone Tips: స్మార్ట్ ఫోన్ వేడెక్కితే పేలిపోయే ఛాన్స్ ఎక్కువ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

Phone Tips: వేసవికాలంలో స్మార్ట్ ఫోన్లు వేడెక్కడం చాలామంది గమనించి ఉంటారు. కొంతమంది స్మార్ట్ ఫోన్లు వేడెక్కిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరి కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. స్మార్ట్ ఫోన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్నిసార్లు పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. వేసవికాలంలో ఛార్జింగ్ పెట్టే సమయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మొబైల్ వినియోగదారులు బ్యాటరీ సేవింగ్ టిప్స్ ను పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. స్మార్ట్ ఫోన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : April 17, 2022 5:29 pm
Follow us on

Phone Tips: వేసవికాలంలో స్మార్ట్ ఫోన్లు వేడెక్కడం చాలామంది గమనించి ఉంటారు. కొంతమంది స్మార్ట్ ఫోన్లు వేడెక్కిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరి కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. స్మార్ట్ ఫోన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్నిసార్లు పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. వేసవికాలంలో ఛార్జింగ్ పెట్టే సమయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

మొబైల్ వినియోగదారులు బ్యాటరీ సేవింగ్ టిప్స్ ను పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. స్మార్ట్ ఫోన్ పై వీలైనంత వరకు సూర్యకాంతి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యకాంతి తగలడం వల్ల స్మార్ట్ ఫోన్ వేడెక్కెఏ అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ విషయంలో ఎప్పుడూ ఒరిజినల్ ఛార్జర్ ను మాత్రమే వినియోగించాలి. ఇష్టం వచ్చిన ఛార్జర్ ను స్మార్ట్ ఫోన్ కు వినియోగిస్తే మాత్రం స్మార్ట్ ఫోన్ వేడెక్కే ఛాన్స్ ఉంటుంది.

ఛార్జింగ్ పెట్టి ఫోన్ ను ఎప్పుడూ మాట్లాడకూడదు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడితే కూడా ఫోన్ పేలిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఛార్జర్ పాడైతే అదే కంపెనీకి సంబంధించిన కొత్త ఛార్జర్ ను వాడితే మంచిదని చెప్పవచ్చు. పగిలిన స్మార్ట్ ఫోన్లు పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పగిలిన స్మార్ట్ ఫోన్లను వినియోగించే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

అతిగా ఫోన్ కు ఛార్జింగ్ పెడుతున్నా ఫోన్ పేలిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. లొకేషన్, బ్లూటూత్ ఫీచర్లను టర్న్ ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. స్క్రీన్ బ్రైట్ నెస్ ను తగ్గించుకోవడం, అనవసరమైన యాప్ లను డిలీట్ చేయడం ద్వారా కూడా ఫోన్ వేడెక్కకుండా చేయడంతో పాటు బ్యాటరీ పేలిపోకుండా జాగ్రత్త పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.