Prashanth Neel: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF చాప్టర్ 2 సృష్టిస్తున్న ప్రబంజనం మనం రోజు చూస్తూనే ఉన్నాం..బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి వస్తున్నా నంబర్లు చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతూన్నారు..కేవలం మూడు రోజుల్లోనే 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని ఫుల్ రన్ లో అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ..ఇదే కనుక జరిగితే బాహుబలి పార్ట్ 2 మరియు #RRR తర్వాత వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకున్న ఏకైక సౌత్ ఇండియన్ సినిమాగా KGF చాప్టర్ 2 సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పొచ్చు..ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి కాసేపు చర్చ పక్కన పెడితే, త్వరలో KGF చాప్టర్ 3 కూడా రాబోతోందా అనేది ప్రస్తుతుం ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ది మొమెంట్ గా మారింది..చివర్లో ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు సినిమా అయిపోయింది కదా అని అందరూ లేచి వెళ్తున్న సమయం పార్టీ 3 కూడా ఉంది అంటూ ఒక్క చిన్న ట్విస్ట్ ని ఇచ్చి అందరిని షాక్ కి గురి అయ్యేలా చేసాడు ప్రశాంత్ నీల్.

ఒక్కవేల పార్ట్ 3 తియ్యాలనే ఆలోచన ఉంటె స్టోరీ ఎక్కడ మిగిలి ఉంది..ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారులు అందరూ చనిపోయారు..హీరో , హీరోయిన్ , విలన్స్ ఇలా అన్ని పాత్రలు చాప్టర్ 2 లో చనిపొయ్యే విషయం మన అందరికి తెలిసిందే..కానీ డైరెక్టర్ ఇప్పుడు కథలో ఎవరు మిగిలి ఉన్నారు అని పార్ట్ 3 తియ్యడానికి సిద్ధం అయ్యిపోయాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్ల తలలు పీక్కుంటున్నారు..అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల ప్రకారం తర్వాత రాబొయ్యే చాప్టర్ KGF చాప్టర్ 2 కొనసాగింపు కథ కాదు అంట..ఇది KGF చాప్టర్ 2 కి ప్రీక్వెల్ అట..రాకీ భాయ్ KGF ని సొంతం చేసుకున్న కొన్నేళ్ల తర్వాత విదేశాల నుండి ఆయనకీ కొన్ని తీవ్రమైన ఒత్తిడిలు ఎదురు అయ్యాయి..వాళ్ళందరిని రాకీ భాయ్ ఎలా ఎదురుకున్నాడు అనేదే స్టోరీ..డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి స్టోరీలు అన్ని ఇలా సింపుల్ గానే ఉంటాయి..కానీ ఒక్కసారి ఆయన సినిమాని మనం చూడడం లో లీనమైనప్పుడు అందులో వచ్చే ఎలేవేషన్స్ మరియు ఎమోషన్స్ కి మనకి తెలియకుండానే గూస్ బంప్స్ ఫీల్ అవుతూ ఉంటాం..అదే ప్రశాంత్ నీల్ గారి టేకింగ్ లో ఉండే మేజిక్.
Also Read: Prabhas: RRR మూవీ చూసి ఘోరంగా ఏడ్చేసాను

ఇక KGF చాప్టర్ 3 ఎప్పుడు మొదలవుతుంది అని ఈ సినిమా అభిమానుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న..ఎందుకంటే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది..ఇది పూర్తి అయినా తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు..ఈ సినిమా తర్వాత ఆయన ఉగ్రం సినిమా హీరో శ్రీమురళి తో ఒక్క సినిమా చెయ్యబోతున్న అని ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో ప్రశాంత్ నీల్ చెప్పాడు..ఇవి అన్ని పూర్తి అయిన తర్వాత మల్లి యాష్ తో మరో సినిమా చెయ్యబోతున్న అని ప్రశాంత్ నీల్ తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆ సినిమా కచ్చితంగా KGF 3 అయ్యి ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు..చూడాలి మరి KGF చాప్టర్ 3 ని ప్రశాంత్ నీల్ ఎలా డీల్ చేస్తాడో అనేది.
[…] Ram Charan: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇందులో చిరంజీవి కి జోడిగా కాజల్ అగర్వాల్ మరియు రామ్ చరణ్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్లు గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు..భారీ అంచనాలు ఏర్పర్చుకున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త రామ్ చరణ్ అభిమానులను కలవరపరుస్తోంది..అదేమిటి అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటుంది అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఈ పాత్ర నిడివి మరింత తగ్గించారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త . […]