
Vastu Tips: మనం వాస్తుకు ప్రాధాన్యం ఇస్తాం. ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు పక్కాగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటాం. ఇందులో భాగంగా వాస్తు ప్రకారం ఏ లోపం ఉన్నా ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే తిప్పలు తప్పవు. ఇంట్లోకి దారిద్ర్యం రాకుండా ఉండాలంటే కొన్ని విషయాలపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. వాస్తు శాస్త్ర రీత్యా మనకు నాలుగు దిక్కులు, నాలుగు దిశలు ఉన్నాయి. తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర దిక్కులు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం నాలుగు దిశలు. దీంతో ప్రతి ఇంటికి కూడా నాలుగు మూలలు ఉండటం సహజమే.
మూలలు ఎన్ని?
మనం ఇల్లు కట్టుకునే స్థలాన్ని బట్టి ఏ మూల ఎంత ఉండాలో చూసుకుంటాం. స్థలానికి ఉండే దిక్కులను బట్టి వీధిని నిర్ణయిస్తారు. వీధిని బట్టి స్థలానికి ఉండే హెచ్చుతగగులు నిర్ణయించడం సహజం. ఆగ్నేయం విషయంలో తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, తూర్పుకు తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, నైరుతి దిశలో పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, పశ్చిమకు దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, వాయువ్యంలో ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యం, ఉత్తర పశ్చిమ వాయువ్యం, ఈశాన్య దిశలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఉత్తర ఈశాన్యం ఇలా మూడు రకాల మూలలు ఉంటాయి.
ఏ మూల పెరిగితే..
ఏ మూల పెరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలిస్తే షాకే. దక్షిణ ఆగ్నేయం పెరిగితే కుటుంబ కలహాలు వస్తాయి. తూర్పు ఆగ్నేయం పెరిగితే సంతాన నష్టం కలుగుతుంది. తూర్పు దక్షిణ ఆగ్నేయం పెరిగితే సంతానంతో పాటు ధనలాభం కలుగుతుంది. చెడు వ్యవహారాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. కోర్టులు, కేసులు, న్యాయస్థానాల చుట్టు తిరగాల్సి ఉంటుంది. దక్షిణ నైరుతి పెరిగితే వ్యాధులు వచ్చే వీలుంటుంది. పశ్చిమ నైరుతి పెరిగితే చెడ్డ వారి స్నేహాలు, ధన నష్టాలు సంభవిస్తాయి. పశ్చిమ దక్షిణం పెరిగితే శత్రుబాధలు ఇబ్బంది పెడతాయి.

ఈశాన్యం మూలకు..
పశ్చిమ వాయువ్యం పెరిగితే అవమానాలు వస్తాయి. అనేక శిక్షలు అనుభవించాలి. ఖర్చులు, ధన నష్టాలు, వ్యాధులు చుట్టు ముడతాయి. ఉత్తర పశ్చిమ వాయువ్యం పెరిగితే ఇంట్లో సంతోషాలు దూరమవుతాయి. శత్రువులు ఎక్కువవుతారు. ఉత్తర వాయువ్యం పెరిగితే అపజయాలు కలుగుతాయి. వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి మూడు మూలలు పెరిగితే ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈశాన్యం మాత్రం కచ్చితంగా పెరగాల్సిందే. ఈశాన్యం మూల పెంచుకుంటే శుభాలు వస్తాయి. వంశాభివృద్ధి, ఐశ్వర్యం, యశస్సు రెట్టింపు అవుతాయి.
జాగ్రత్తలు తీసుకోకపోతే..
ఉత్తర ఈశాన్యం పెరిగితే అదృష్టం వరిస్తుంది. కుటుంబ సభ్యులకు గౌరవం పెరుగుతుంది. ఈశాన్యం మూల ఇంటికి ఎంతో ఉత్తమం. అందుకే ఈశాన్యం మూలలో బరువులు ఉంచకూడదు. చీపురు, చెత్త బుట్టల లాంటివి పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల కూడా నష్టాలు కలుగుతాయి. ఈశాన్యం మూలలో అత్యంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎలాంటి వస్తువులు ఉంచకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మనకు అన్ని లాభాలు చేకూరడానికి అవకాశాలు కలుగుతాయి.