Health: “మండలం” అంటే 40 ఏళ్ళు దాటితే సంసారానికి పనికిరారని మన పూర్వీకులు ఎన్నడో సెలవిచ్చారు. అయితే అది ముమ్మాటికి నిజమని తాజా సర్వేలు చెబుతున్నాయి. 40 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం వ్యర్థం అని దాని అర్థం.. అప్పుడు పెళ్ళి చేసుకున్నా లాభం లేదని, లైంగిక పటుత్వం, వీర్య కణాల వృద్ధి కూడా క్రమక్రమంగా తగ్గిపోతుందని, దీంతో సంసార జీవితానికి దూరమవుతారని డాక్టర్లు కూడా చెబుతున్నారు.
*పెళ్లి అయిన వారు..*
అలాగే పెళ్లి అయిన వారు కూడా 40 దాటిన తరువాత ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అయితే అందుకు సరైన సమయంలో బలవర్థకమైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, పని ఒత్తిడి కూడా కారణం కావచ్చు. దీనికి తోడు రేడియేషన్ ప్రభావం కూడా భారీగా పడుతున్నట్లు కనుగొన్నారు. డిజిటల్ యుగంలో మితిమీరిన
మొబైల్స్ వాడకం వల్ల రేడియేషన్, వాతావరణ పరిస్థితులు ఇంకా ఈ సమస్యను పెద్దగా చేస్తుంది.
ఈ సమస్య మెట్రో, నాన్ మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగింది.
*ప్రత్యామ్నాయాల కోసం పాకులాట*
ఈ సమస్యను అధిగమించేందుకు మాదక ద్రవ్యాలను (డ్రగ్స్) ఆశ్రయిస్తున్నట్లు సర్వేలో తేల్చారు. అయితే గతంలో 40+ పేరుతో బీ కాంప్లెక్ టాబ్లెట్ కు విపరీతమైన క్రేజ్ లభించింది. మార్కెట్లో ఇలాంటి ప్రేరకలు ఎన్నో వచ్చాయి. డాక్టర్ల సలహా లేకుండా వీటిని తీసుకోవడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయని తేలుకోవాలి. శారీరక బలంతో పాటు మానసికంగా సంసారం చేసే ఉత్సాహం కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే సంసారం మధురంగా మారుతుంది.