Hanuman Pooja: సకల భయాలను తొలగించే దేవుడిగా హనుమంతుడిని కొలిస్తే సకల భయాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతీ మంగళ, శనివారాల్లోను ఆంజనేయుడిని కొలుస్తూ ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారు. హనుమంతుడిని సేవించడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయని కొందరు అర్చకులు ఉంటారు. అయితే బ్రహ్మచారి అయిన ఆ భగవంతుడి అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పద్ధతిలో పూజించాలంటున్నారు. అంతేకాకుండా హనుమంతుడిని ఉపాసన చేస్తే మనిషి నడవడిక లో మార్పులు వస్తాయని అంటున్నారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..
రామాయణంలో రాముని తరువాత హనుంతుడి గురించి ఎక్కువగా ఉంటుంది. ఆయన చేసే కార్యాలు మానవ జీవితంలో ఎన్నో ఎదురవుతాయి. వీటిని ఎలా పరిష్కరించుకోవాలో ఆ దేవుడు తన పనుల వల్ల చెప్పగలిగాడు. మరి మానవులకు అలాంటి ధైర్య, సాహసాలు రావాలంటే హనుమంతుడి ఉపాసన చేయాలి. ఉపాసన చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. ఎలాంటి చెడు వ్యాఖ్యలు పలకకూడదు. ఆంజనేయస్వామికి పూజ చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
హనుమంతుడికి 5వ సంఖ్య అంటే చాలా ఇష్టం. ప్రతి మంగళ లేదా శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఆలయంలో ఉండే వాతావరణం ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అంతేకాకుండా ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని చెబతారు. గ్రహదోషం తో బాధపడేవారు హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించడం వల్ల గ్రహశాంతిని పొందుతారు.
సంతానం లేనివారు మండలం రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. హనుమంతుడికి అరటిపండు అంటే చాలా ఇష్టం. అందువల్ల అరటిపండ్లతో హనుమంతుడికి నివేదించడం వల్ల దైవానుగ్రహం పొందగలుగుతారు. అంతేకాకుండా మామిడి పళ్లు కూడా హనుమంతుడికి చాలా ఇష్టమని చెబుతారు.