Watermelon Rind: ఈరోజుల్లో శృంగార సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యలో పుచ్చకాయ తింటే ఎన్నో లాభాలున్నాయి. పుచ్చకాయ గుజ్జు కాకుండా దాని గింజలు, పై పొర కూడా శృంగార సమస్యలకు చెక్ పెడతాయని తెలిస్తే షాకే. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీన్ని తినడం ద్వారా మనకు అనేక పోషకాలు అందుతాయి. పుచ్చకాయ తొక్కను తింటే శృంగార పరంగా వచ్చే ఇబ్బందులను తొలగించుకోవచ్చు.
పుచ్చకాయ తొక్క వయాగ్రాలా పనిచేస్తుంది. పలు పరిశోధనల ప్రకారం లైంగిక కోరికలు పెంచేవాటిలో పుచ్చకాయ ప్రధానమైనది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు లిబిడోను ప్రోత్సహించి శృంగార వాంఛను పెంచుతుంది. పుచ్చకాయ తొక్కలను వయాగ్రాతో పోల్చడంలో ఉన్న అర్థం అదే కావడం గమనార్హం. పుచ్చకాయ తొక్కపై నిమ్మరసం కారం పొడి చల్లుకుని తింటే మంచి ఫలితాలు ఉంటాయి.
పుచ్చకాయ తొక్కలో సిట్రులైన్ పుష్కలంగా ఉండటంతో రక్తనాళాల విస్తరణను పెంచుతుంది. ఇది కండరాల ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. దీని వల్ల ఒంట్లో శక్తి పెరుగుతుంది. శారీరక శ్రమ పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఇలా పుచ్చకాయ తొక్క కూడా మన లైంగిక ఉద్దీపనలు పెంచేందుకు సాయపడుతుంది. దీని వల్ల మనకు చాలా లాభాలున్నాయి.
పుచ్చకాయ అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. పుచ్చకాయ తొక్క రక్తపోటును అదుపులో ఉంచుతుందని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వేసవిలో పుచ్చకాయ తొక్కను తినాలనుకుంటే ఫ్రిజ్ లో కాసేపు పెట్టి తింటే మంచిది. ఇలా పుచ్చకాయ తొక్క రక్తపోటుతో పాటు లైంగిక సామర్థ్యం పెంచేందుకు పాటుపడుతుంది.