Hair Fall: ఇలా చేస్తే రాలిన వెంట్రుకలు వెంటనే వచ్చేస్తాయి..

కొత్త జుట్టు రాకుండా జుట్టు సరిగ్గా పెరగకుండా ఉంటే డాబర్ వాటర్ హెల్స్ తీసుకుంటే సరిపోతుంది. నారింజ రసం, చియా గింజలు, బీట్రూట్ రసాలను కొబ్బరి నీళ్లలో కలపండి.

Written By: Swathi, Updated On : May 3, 2024 10:40 am

Hair Fall

Follow us on

Hair Fall: జుట్టు రాలడం ప్రస్తుతం కాలంలో పెద్ద సమస్య. ఈ సమస్య నుంచి బయటపడాలని ఎన్నో షాంపూలు, ఆయిల్స్, కండీషనర్లు ఉపయోగిస్తుంటారు. కానీ ఫలితం శూన్యం. ఇక రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రాకపోవడం మరింత పెద్ద సమస్య. మరి మీరు ఈ సమస్య ఎదుర్కొంటే కొన్ని జ్యూస్ లను తాగితే చాలు ఎలాంటి షాంపూలు అవసరం లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ అవేంటో ఓ సారి చూసేయండి.

డాబర్ వాటర్-ఉసిరి
కొత్త జుట్టు రాకుండా జుట్టు సరిగ్గా పెరగకుండా ఉంటే డాబర్ వాటర్ హెల్స్ తీసుకుంటే సరిపోతుంది. నారింజ రసం, చియా గింజలు, బీట్రూట్ రసాలను కొబ్బరి నీళ్లలో కలపండి. ఈ డ్రింక్ ను వారానికి 3 నుంచి 4 రోజులు తీసుకుంటే చాలు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వస్తాయి.

బాదం స్మూతీ
అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, తామర గింజలు, గుమ్మడి గింజలు, చియా గింజలను తేలిక పాటి సెగమీద వేయించాలి. వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. మరో వైపు బాదం, ఖర్జూరాలను నీటిలో నానబెట్టుకోవాలి. ఈ నీటిలో గింజల పొడిని కలిపి స్మూతీ తయారు చేసుకోవాలి. దీని వల్ల జుట్టు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.

సోంపు, తులసి ఆకుల నీరు
తులసి ఆకులు, సోంపు తో తయారు చేసిన డ్రింక్ జుట్టుకు పోషణను ఇస్తుంది. చెంచా సోంపు గింజలను గ్లాసు నీటిలో వేసి రాత్రి నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం అందులో తులసి ఆకుల రసం కలిపి తాగాలి. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

అలోవెరా జ్యూస్.. చర్మ సమస్యలు మాత్రమే కాదు అలోవెరా జ్యూస్ జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. అమైనో ఆమ్లాలు, కెరాటిన్ వంటి పోషకాలతో నిండిన ఈ డ్రింక్ జుట్టు సమస్యలను చిటికెలో నివారించేలా చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే జుట్టు రాలడం, జుట్టు నెరవడం వంటి సమస్యలు తగ్గుతాయి.