https://oktelugu.com/

Coconut Water: ఎక్కువ నీరు ఉన్న కొబ్బరిబొండాలను ఎలా గుర్తుపట్టాలి? నీరు తియ్యగా ఉండాలా అయితే తెలుసుకోండి

కొబ్బరి బొండాలు అమ్మేవారికి ఎందులో ఎక్కువ నీరు ఉందో తెలిసిపోతుంది. వారి బిజినెస్ పెంచుకునేలా కొందరికి మాత్రమే వాటిని ఇస్తుంటారు. మరి మీరు ఎలా తెలుసుకోవాలి అంటే.. ఈ సారి కొబ్బరి నీరు తాగేటప్పుడు ఫుల్ నీరు ఉన్న కాయను మీరే చూసుకుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 26, 2024 / 03:35 PM IST

    Coconut Water

    Follow us on

    Coconut Water: వామ్మో ఎండలు మండిపోతున్నాయి. ఫుల్ గా నీరు తాగాల్సిందే.లేదంటే బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. మరి బయటకు వెళ్తే ఓ జ్యూస్ లేదా కొబ్బరి బొండా తాగకుండా ఇంటికి రావాలి అనిపిస్తుందా అంటే నో అంటారు. మరి ఈ కొబ్బరి బొండాలు సమ్మర్ లో చాలా రేట్ ఉంటాయి. మరి రేటుకు తగ్గట్టు నీరు ఉంటుందా అంటే తక్కువే ఉంటాయి. మరి కొబ్బరి బొండాలో నీరు ఎక్కువ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది ఓ సారి చదివేయండి. ఈజీ పని అనుకుంటారు.

    కొబ్బరి బొండాలు అమ్మేవారికి ఎందులో ఎక్కువ నీరు ఉందో తెలిసిపోతుంది. వారి బిజినెస్ పెంచుకునేలా కొందరికి మాత్రమే వాటిని ఇస్తుంటారు. మరి మీరు ఎలా తెలుసుకోవాలి అంటే.. ఈ సారి కొబ్బరి నీరు తాగేటప్పుడు ఫుల్ నీరు ఉన్న కాయను మీరే చూసుకుంటారు. అదెలా అంటే.. కొబ్బరికాయను తీసి బాగా కదిలించండి దానిని కదిలించినప్పుడు నీరు చిమ్మితే అందులో నీరు తక్కువగా ఉందని అర్థం. నీటి శబ్దం తక్కువగా వినిపిస్తే అందులో నీరుకు కొదువ లేదని అర్థం. సో అది తీసుకోవచ్చు.

    కొబ్బరికాయ గుండ్రంగా, పెద్దగా ఉంటే అందులో నీరు ఎక్కువగా ఉంటుంది. కొన్ని ముదురు గోధుమ రంగులో ఉంటాయి. అందులో కూడా నీరు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది పండు కొబ్బరికాయ గా మారుతుందని తెలుసుకోవాలి. సో అందులో నీరు తక్కువగా ఉంటుంది. అందుకే కొబ్బరి కాయ కచ్చితంగా ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోండి. ఇక కొబ్బరి నీరు ఫుల్ గా ఉంటే నీరు కూడా తియ్యగా ఉంటుంది.

    నీరు తక్కువ ఉన్న కొబ్బరి కాయలు కూడా కొన్ని తియ్యగా ఉంటాయి. మొత్తం మీద మీకు నచ్చిన విధంగా కొనుగోలు చేయవచ్చు. లేదా అమ్మేవారిని అడిగి మరీ తీసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే.. కొబ్బరి నీళ్లు కొనుగొలు చేస్తే కొన్న వెంటనే తాగేసేయండి. లేదంటే అందులోని పోషకాలు మొత్తం ఆవిరి అయిపోతాయని తెలుసుకోండి.