https://oktelugu.com/

Accumulated toxins : శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను ఎలా దూరం చేసుకోవాలంటే?

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ ను తీసుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారం పోషకాహారం కావాలి. ఈ ఫుడ్ వల్ల మన బాడీకి పోషణ, బలం అందాల్సిన అవసరం ఎంతో ఉంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 27, 2024 / 08:10 AM IST

    How to get rid of accumulated toxins in the body?

    Follow us on

    Accumulated toxins : ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ ను తీసుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారం పోషకాహారం కావాలి. ఈ ఫుడ్ వల్ల మన బాడీకి పోషణ, బలం అందాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. దీనివల్లే శక్తి కూడా పెరుగుతుంది. కానీ ప్రస్తుతం కలుషితమైన, రసాయన పదార్థాలతో కూడిన ఆహారం ఎక్కువగా లభిస్తుంది. వీటి ఎఫెక్ట్ వల్ల ఫుడ్ చాలా హానికరంగా మారుతుంది. ఇలాంటి ఫుడ్ తింటే మన బాడీలో టాక్సిన్స్ పెరుగుతాయి. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

    రెండు రకాల టాక్సిన్స్ ఉంటాయి శరీరంలో ఉంటాయి. ఒకటి ఆహారం జీర్ణమైన తర్వాత ఏర్పడే సహజమైనవిగా ఉంటే మరికొన్ని రసాయనాలు, ఎరువుల ద్వారా పండే పంటలతో వస్తుంటాయి. అయితే ఇవి కృత్రిమమైన టాక్సిన్స్. ఈ టాక్సిన్స్ వల్ల శరీరంలో చాలా సమస్యలు వస్తాయి. అందుకోసం డైట్‌లో కొన్ని కూరగాయలు ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. దీని వల్ల బాడీలోని టాక్సిన్స్‌ని బయటికి వెళ్తాయి అంటున్నారు నిపుణులు.

    నట్స్‌, గింజల్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలిగిపోతాయి. ఇవి ఒకటి మాత్రమే కాదు వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కూడా మీ డైట్ లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. వీటి వల్ల అవయవాలు కూడా చక్కగా ఉంటాయి. ఇందులో బెర్రీస్, బెల్ పెప్పర్స్, సిట్రస్ ఫ్రూట్స్, బ్రకోలీ, చిక్కుళ్ళు, గ్రీన్‌టీలు వంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

    సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్, పుచ్చకాయలు వంటి పండ్లను తినడం మరింత మంచిది. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ లో నీటిశాతం ఎంత ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్ కూడా అంతే విధంగా అందుతాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే శరీరంలోని టాక్సిన్స్ దూరం అవుతాయి. దీంతో ఆరోగ్యం బాగుంటుంది. ఇక తాజా కూరగాయలు, ముఖ్యంగా బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్‌లో సల్ఫర్ కలిగిన సమ్మేళనాలు లభిస్తాయి కాబట్టి వీటిని తీసుకోవడం మర్చిపోవద్దు. వీటి వల్ల కూడా శరీరంలోని టాక్సిన్స్ దూరమవుతాయి. దీంతో పాటు జీర్ణ సమస్యలు, ఇతర సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు.

    పసుపులోని గుణాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందుకే దీన్ని తరతరాలుగా వాడుతున్నారు. వంటల్లోనే కాదు ఆయుర్వేద మందుల తయారీల్లోనూ పసుపు ముందు ఉంటుంది. పసుపుని వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇమ్యూనిటీని పెంచి అనారోగ్యాలను దూరం చేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపు చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

    పులియబెట్టిన ఫుడ్స్‌ తినడం కొందరికి నచ్చదు. కానీ ఇందులో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుందట. వీటిని మీరు మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే ప్రేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియాకు పులిస్టాప్ పెట్టేయవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ నీరు కూడా ఎక్కువగా తాగాలి.

    ఉల్లి వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల డీటాక్స్ అవుతుంది. కూరల్లో మాత్రమే కాదు వీటిని పచ్చిగా కూడా తినవచ్చు. అదే విధంగా, నెయ్యి, వెన్న, తేనె, ఎండు అల్లం, నల్ల మిరియాలు, రాళ్ళ ఉప్పుని కూడా డైట్ లో చేర్చుకోవడం వల్ల టాక్సిన్స్‌ని దూరం చేసుకోవచ్చు.