https://oktelugu.com/

Japan Bank: ఈ బ్యాంకులో పని చేయాలంటే.. నెత్తురు చిందించాలి.. చివరికి ఆత్మహత్యకూ వెనకాడొద్దు..

జపాన్ దేశం గురించి మీకు తెలుసు కదా.. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆ దేశం ప్రపంచానికే కొత్త దారి చూపెడుతోంది. గొప్ప గొప్ప కంపెనీలు మొత్తం ఆ దేశం లోనే ఉన్నాయి. వర్క్ స్టైల్ లో జపాన్ దేశం ప్రపంచాని కంటే భిన్నంగా ఉంటుంది. పని అనేది వారి నర నరాల్లో జీవించుకుపోయి ఉంటుంది. కష్టపడే తత్వం వారి జీన్స్ లో పెనవేసుకొని ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 27, 2024 / 08:20 AM IST

    Japan Bank

    Follow us on

    Japan Bank: ఉద్యోగం ఇచ్చే సంస్థ ఎంప్లాయ్ సంక్షేమం కోసం పాటుపడాలి. ఎంప్లాయ్ కూడా సంస్థ అభివృద్ధి కోసం పని చేయాలి. ఇవి రెండు సక్రమంగా సాగితే సంస్థ పదికాలాలపాటు బాగుంటుంది. ఉద్యోగి జీవితం కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో అక్కడ ఉద్యోగం చేయాలంటే రక్తం చిందించాలి. చివరికి ఆత్మహత్య కూడా వెనకాడొద్దు.

    జపాన్ దేశం గురించి మీకు తెలుసు కదా.. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆ దేశం ప్రపంచానికే కొత్త దారి చూపెడుతోంది. గొప్ప గొప్ప కంపెనీలు మొత్తం ఆ దేశం లోనే ఉన్నాయి. వర్క్ స్టైల్ లో జపాన్ దేశం ప్రపంచాని కంటే భిన్నంగా ఉంటుంది. పని అనేది వారి నర నరాల్లో జీవించుకుపోయి ఉంటుంది. కష్టపడే తత్వం వారి జీన్స్ లో పెనవేసుకొని ఉంటుంది. అందువల్లే జపాన్ దేశ ప్రజలకు కష్టపడి పనిచేసే మనుషులు అని పేరు వచ్చింది. జపాన్లో యుక్త వయసు వారి నుంచి వృద్దుల వరకు పనిచేస్తూనే ఉంటారు. ఒకరి మీద ఆధారపడడాన్ని వారు అసలు ఒప్పుకోరు. పైగా సంపాదన విషయంలోనూ నిక్కచ్చిగా ఉంటారు. ఎంత మేరకు అవసరమో అంతవరకు ఖర్చు పెడతారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారు కాబట్టే జపాన్ ఆసియాలోనే సంపన్న దేశాలలో ఒకటిగా వెలుగొందుతోంది.

    150 సంవత్సరాల చరిత్ర గల బ్యాంక్..

    ఇక జపాన్ దేశంలో షికోకు అనే పేరుతో ఒక బ్యాంకు ఉంది. దీనికి 150 సంవత్సరాలు చరిత్ర ఉంది.. అయితే ఇక్కడ పని చేయడానికి సిబ్బంది గర్వంగా చెప్పుకుంటారు. అయితే ఆ బ్యాంక్ ఇటీవల సరికొత్త షరతులను పెట్టింది. తమ బ్యాంకులో పని చేసే ఉద్యోగులు కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.. ఇటీవల కాలంలో బ్యాంకులో పనిచేసే ఉద్యోగులలో నైతికత పడిపోయిన నేపథ్యంలో స్పష్టమైన సూచనలు జారీ చేసింది. వాటిని వెబ్ సైట్ లో ప్రస్తావించింది..” ఇక్కడ పనిచేసేవారు డబ్బును దొంగలించకూడదు. చోరీకి కూడా సహకరించకూడదు. ఒకవేళ ఈ విషయం విచారణలో వెలుగులోకి వస్తే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. అంతేకాదు వెంటనే ఆత్మహత్య చేసుకోవాలి. దీనిని ధ్రువపరుస్తూ తమ రక్తంతో అధికారిక దస్త్రంపై సంతకం చేయాలని” వెబ్ సైట్ లో ప్రస్తావించింది. అయితే ఈ విషయం సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..” బ్యాంకులో ఉద్యోగం చేయడం వరకు ఓకే. కానీ ఇలా లేని పోని నిబంధనలు పెడితే ఉద్యోగులు ఎలా పనిచేస్తారని” కొంతమంది వ్యాఖ్యానిస్తుండగా..” ఇలా నిబంధనలు పెడితే ఉద్యోగుల్లో నైతికత ఎలా పెరుగుతుందని” మరికొందరు పేర్కొంటున్నారు..”ఆత్మహత్యలు, రక్తంతో సంతకం చేయడం ఇవన్నీ చూస్తుంటే హాస్యాస్పదం అనిపిస్తుంది.. సాంకేతికతకు సరికొత్త అర్థం చెప్పే జపాన్ దొంగతనాలను అడ్డుకోలేదా? దొంగతనానికి పాల్పడే ఉద్యోగులను గుర్తించలేదా” అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా షికోకు బ్యాంక్ యాజమాన్యం తీసుకువచ్చిన ఈ నిబంధనలు రకరకాల చర్చలకు దారితీస్తున్నాయి.