Milk For Skin: పాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి. పాలను వాడటం వల్ల ఎన్నో చర్మ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాదు నిగనిగలాడే చర్మం మీ సొంతం అవుతుంది. చర్మంపై ఉండే బ్యాక్టీరియా తొలిగి మొటిమలు తగ్గుతాయి. మరి ఈ పాల వల్ల ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో కూడా ఓ సారి తెలుసుకోండి.
పాలలో బయోటిన్, మాయిశ్చరైజింగ్ కారకాలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడుతూనే హైడ్రేట్ గా ఉంచడంలో మంచి పాత్ర పోషిస్తాయి. లోపల నుంచి తేమను కాపాడేందుకు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. పాలలో బీటా హైడ్రాక్సీ యాసిడ్ అనే ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. డెడ్ సెల్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ని తొలగిస్తుంది. దీంతో చర్మం నిగనిగలాడుతూ మెరుస్తుంది.
పాలలో విటమిన్ ఎ, విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్, విటమిన్ బి 12, మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవన్నీ మంచి పాత్రను పోషిస్తాయి. పాలలో మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ను ఉంటాయి. ఇవి చర్మంపై టోనర్ లా పనిచేస్తాయి. దీనివల్ల చర్మం మృదువుగా ఉంటుంది. సహజమైన సన్ స్క్రీన్, టాన్ రివర్ సింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి పాలు. పచ్చి పాలను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మం దెబ్బతినదు. సన్ బర్న్ వల్ల కలిగే ఇబ్బంది కూడా తొలగిపోతుంది.
పాలలో ఉండే మెగ్నీషియం ఫ్రీ రాడికల్స్ తో పోరాడి ముడతలు, ఫైన్ లైన్స్ రాకుండా సహాయపడతాయి. అంతేకాదు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి యంగ్ గా కనిపించేలా చేస్తాయట. చర్మం మీద పాలను రెగ్యులర్ గా రాస్తే టైరోసిన్ స్రావాన్ని నిరోధించవచ్చు. పాలతో మసాజ్ చేస్తే చర్మ సమస్యలైన తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు దూరం అవుతాయి. అందుకే పాలను రెగ్యులర్ గా మొహం మీద అప్లై చేయాలి.