Mutton: మానవ శరీర ఆరోగ్యానికి శాఖాహారం తో పాటు మాంసాహారం కూడా ముఖ్యమని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతూ ఉంటారు. అయితే శాకాహారం కంటే మాంసాహారం ఎక్కువ రుచిని కలిగి ఉండడంతో పాటు ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది మాంసాహారంనే కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు శుభకార్యాలు లేదా ప్రత్యేక రోజుల్లో మటన్ తో కూడిన భోజనంను ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు అయితే వారానికి రెండు లేదా మూడుసార్లు మాంసాహార భోజనం చేస్తూ ఉంటారు. అయితే వీటిలో మటన్ వారానికి ఎంత తీసుకోవాలి? అంతకుమించి తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? మటన్ లో ఉండే ప్రోటీన్లు ఏవి? ఆ వివరాల్లోకి వెళ్దాం..
మటన్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి12 ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థ సక్రమంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో బి 1, బి 2, బి3 అంటే విటమిన్లు ఉంటాయి. వీటితోపాటు విటమిన్ ఈ, విటమిన్ కే లభ్యమవుతాయి. ఇందులో ఐరన్ తో పాటు జింక్, ఫాస్పరస్, కాల్షియం వంటి కనిజాలు కూడా ఉంటాయి. మటన్ లో సహజమైన కొవ్వులు ఉంటాయి. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభ్యం అవుతాయి. గొర్రె మటన్ కంటే మేక మటన్ అత్యధిక ప్రోటీన్లను కలిగి ఉంటుంది.
అయితే మటన్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక శరీరంలోకి మోతాదుకు మించిన మటన్ వెళ్తే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా మటన్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అలాగే బరువు పెరగడం, ఉబకాయం వంటి సమస్యలు కూడా రావచ్చు. కాలేయం, మూత్రపిండాల్లో సమస్యలు ఏర్పడతాయి. టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు మటన్ తినడం వల్ల అవస్థలు పడతారు.
మటన్ లో ఎక్కువగా ప్రోటీన్లు ఉండడం వల్ల ఇవి శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే మోతాదుకు నుంచి మటన్ తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి ఒకసారి మటన్ తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఇది కూడా 100 గ్రాములకు మించొద్దని పేర్కొంటున్నారు. అయితే శారీరక శ్రమ చేసేవారు 200 గ్రాములు తీసుకున్నా.. పర్వాలేదు. మటన్ తీసుకుని సమయంలో అందులో కొవ్వు పదార్థం ఎక్కువగా లేకుండా చూడాలి. ఇది శరీరంలోకి వెళ్లి చెడు కొలెస్ట్రాల్ ను తయారుచేస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, బీపీ ఎక్కువగా ఉన్నవారు, యూరిక్ ఆసిడ్ సమస్యలు ఉన్నవారు మటన్ కు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు. అయితే వీరు రైతుల సలహా మేరకు అవసరమైన అంతవరకు తీసుకోవచ్చు.