Kantara 2 Collection Day 3: భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలైన ‘కాంతారా 2′(Kantara: The chapter 1) మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని థియేటర్స్ లో నడుస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వొచ్చు ఏమో కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద ఫ్లాప్ అయ్యేలా అనిపిస్తుంది. మూడు రోజుల్లో ఈ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి విడుదలకు ముందు 90 కోట్ల రూపాయికుల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంత మొత్తం లాంగ్ రన్ లో రాబట్టడం ప్రస్తుతానికి కష్టం గానే అనిపిస్తుంది. ఎందుకంటే నేడు ఆదివారం అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని నమోదు చేసుకోలేకపోయింది ఈ చిత్రం. ఈ సినిమా కంటే పది రోజుల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ కి ఎక్కువగా హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడం గమనార్హం.
ఆదివారమే ఇలా ఉంటే, ఇక లాంగ్ రన్ ఏముంటుంది?, 90 కోట్ల బిజినెస్ రీకవర్ చేయడం అనేది చిన్న విషయం కాదు. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్, గీత ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి కొనుగోలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నైజాం ప్రాంతం లో విడుదల చేస్తే, గీత ఆర్ట్స్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల చేసింది. ఈ ఏడాది గీతా ఆర్ట్స్ సంస్థ పట్టిందల్లా బంగారం లాగ మారుతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. అలా మంచి సక్సెస్ స్ట్రీక్ తో కొనసాగుతున్న గీతా ఆర్ట్స్ కి ఈ చిత్రం పెద్ద షాక్ ఇచ్చేలాగానే అనిపిస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి నిన్న వచ్చిన వసూళ్లు దాదాపుగా 60 కోట్ల గ్రాస్ వరకు ఉంటుందని అంచనా.
అలా మొత్తం మీద ఈ చిత్రం మూడు రోజులకు కలిపి 212 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు మించేటట్టుగా అనిపించడం లేదు. వెయ్యి కోట్ల గ్రాస్ టార్గెట్ తో వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఓవర్సీస్ వసూళ్లు భారీ లెవెల్ లో డెంట్ పెట్టింది. మూడు రోజులకు కలిపి కేవలం 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొదటి రోజు వస్తుందని అనుకున్న వసూళ్లు ఇవి. చూడాలి మరి కనీసం లాంగ్ రన్ లో అయినా సత్తా చాటుతుందా లేదా అనేది .