Hair Oil: ఫ్యాషన్ అంటూ జుట్టుకు నూనె పెట్టడం లేదా? ఇంతకీ వారానికి ఎన్ని సార్లు నూనె పెట్టాలంటే..

జుట్టుకు నూనె రాయడం వల్ల కుదుళ్లు బలపడతాయి. అయితే జుట్టుకు విటమిన్లు, ఖనిజాలు , కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలను అందించడం ద్వారా జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఇక నూనె రాయడం వల్ల జుట్టు పొడిబారకుండా, జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పొడిగా ఉండి చిట్లి పోతుంటే వారానికి మూడుసార్లు జుట్టుకు నూనె రాయండి.

Written By: Swathi Chilukuri, Updated On : July 9, 2024 5:30 pm

Hair Oil

Follow us on

Hair Oil: జుట్టు రాలడం అనే సమస్యను ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. బలహీనపడటం, జుట్టు రాలడం, తెల్లగా మారడం వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇంతకీ జుట్టుకు మీరు నూనె రాస్తున్నారా? మరి ప్రతి రోజు రాస్తున్నారా? లేదా వారానికి కొన్ని సార్లు రాస్తున్నారా? ఇంతకీ వారానికి ఎన్ని సార్లు నూనె రాయాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టుకు నూనె రాయడం వల్ల కుదుళ్లు బలపడతాయి. అయితే జుట్టుకు విటమిన్లు, ఖనిజాలు , కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలను అందించడం ద్వారా జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఇక నూనె రాయడం వల్ల జుట్టు పొడిబారకుండా, జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పొడిగా ఉండి చిట్లి పోతుంటే వారానికి మూడుసార్లు జుట్టుకు నూనె రాయండి. దీని వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. నూనె రాస్తే జుట్టు మెరుస్తుంది కూడా. చాలా మంది నూనె రాసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు కానీ నూనె రాయడం చాలా ముఖ్యం.

నూనెతో జుట్టును సున్నితంగా మసాజ్ చేయాలి. దీని వల్ల జుట్టు మదృువుగా మారుతుంది. తేమను కూడా పెంచుతుంది. అయితే రోజూ తలకు నూనె రాసుకోవాలని చెబుతుంటారు పెద్దలు. కానీ ఇప్పుడు తలకు నూనె రాయడం చాలా మందికి ఇష్టం ఉండదు. జిడ్డు మాదిరి కనిపిస్తుందని లైట్ తీసుకుంటారు. కానీ నూనె పెట్టుకోకపోతే జుట్టు రాలడం, చుండ్రు, కుదుళ్ళు బలహీనంగా మారటం వంటి సమస్యలు వస్తాయి.

రోజూ మీ జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. నూనె జుట్టు మీద బయటి పొరను ఏర్పరిచి.. కాలుష్యం, చెడు వాతావరణం, UV కిరణాలు మొదలైన వాటి నుండి జుట్టుకు రక్షణ కల్పిస్తుంది. మీ స్కాల్ప్ పొడిది అయితే వారానికి 2 నుంచి 3 సార్లు నూనె రాయాలి. కానీ జిడ్డు తల ఉన్నవారు మాత్రం వారానికి ఒకసారి నూనె రాసుకుంటే సరిపోతుంది. సాధారణ జుట్టు అయితే రెండు సార్లు అయినా పెట్టుకోవచ్చు.