New Year Celebrations : కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అని వెనుకటికి ఓ కవి చెప్పాడు.. ఈ దేశాలు కూడా పై సూక్తిని పాటిస్తున్నాయి. కొత్త సంవత్సరం వేళ విభిన్నంగా వేడుకలు జరుపుకుంటూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భారతీయులు కొత్త సంవత్సర వేడుకలను ఇంట్లో లేదా బయట జరుపుకుంటారు.. కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.. ఇక ప్రపంచంలో కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరానికి భిన్న పద్ధతుల్లో స్వాగతం పలికే సంప్రదాయం ఉంది.. ముఖ్యంగా మరికొన్ని దేశాలు అయితే నూతన సంవత్సర వేడుకలను ప్రత్యేకమైన సంప్రదాయాల్లో జరుపుకుంటాయి. నూతన సంవత్సరం వేళ వివిధ దేశాల్లో వేడుకలు, వాటి విశిష్ట సంప్రదాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్పెయిన్
స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజున ఆ దేశ ప్రజలు పాటించే సంప్రదాయం గురించి తెలిస్తే ఆశ్చర్యం అనిపించక మానదు.. కొత్త సంవత్సరం అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తింటారు. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది.. 12 ద్రాక్ష పండ్లు 12 నెలలకు సమానం.. రాబోయే సంవత్సరంలో ఒక్కో ద్రాక్ష పండు ఒక్కో నెల అదృష్టంతో ముడిపడి ఉంటుంది.. స్పెయిన్ లోని మ్యాడ్రిడ్, బార్సిలోనా వంటి పెద్ద నగరాల్లో ద్రాక్ష పండ్లను కలిసి తినేందుకు ప్రధాన కూడలిలో ప్రజలు భారీగా చేరుకుంటారు. కేరింతలు కొడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
డెన్మార్క్
డెన్మార్క్ లో నూతన సంవత్సరం సందర్భంగా అక్కడి ప్రజలు తలుపుల వద్ద పాత ప్లేట్లు, గ్లాసులను విసిరి కొట్టి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వల్ల చెడు ఆత్మలు అదృశ్యం అవుతాయని వారి నమ్మకం.. ఎవరి ఇంటి గుమ్మం వద్ద విరిగిన పాత్రలు ఎంత ఎక్కువ పేరుకుంటే.. ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని విశ్వాసం.
అమెరికా
కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికా ప్రజలు తమ టీవీ ముందు కూర్చుంటారు.. ప్రతి సంవత్సరం అర్ధరాత్రి బాల్ డ్రిప్ ను చూసేందుకు వారు ఇలా చేస్తారు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే సమయంలో కొత్త ప్రధాన కార్యాలయంలో బాల్ డ్రాప్ ను చూసే అలవాటు న్యూ ఇయర్ వేడుకలలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంప్రదాయాలలో ఒకటి.
బ్రెజిల్
కార్నివాల్ వంటి వేడుకలకు ప్రశస్తి పొందిన బ్రెజిల్ దేశంలో నూతన సంవత్సరం సందర్భంగా అక్కడి ప్రజలు ప్రత్యేకమైన పనులను చేస్తారు. కొత్త సంవత్సర సందర్భంగా ప్రత్యేకమైన లో దుస్తులు ధరిస్తారు ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వరిస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.
ఫిన్లాండ్
ఫిన్లాండ్ లో ప్రజలు రాబోయే సంవత్సరంలో జరిగే విశేషాల గురించి ఊహిస్తారు. దీనికోసం వారు కరిగిన టిన్ ను నీటిలో ముంచి, మొహం గట్టిపడిన తర్వాత… లోహానికి ఆకారంగా మార్చే ప్రక్రియ చేపడతారు.. గుండె లేదా ఉంగరం ఆకలని తీసుకుంటే అది వివాహం జరిగేందుకు చిహ్నం అని భావిస్తారు.. ఓడరూపాన్ని గనక తీసుకుంటే అది ప్రయాణంతో ముడిపడి ఉంటుందని భావిస్తారు.. ఒకవేళ విచిత్రమైన ఆకారంగా వస్తే మరణం సంభవిస్తుందని నమ్ముతారు. ఇక ఆఫ్రికా దేశాల్లో అయితే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: How is the new year celebrated in these countries
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com