Akhanda 2 Box Office Collection: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ రన్ ని సొంతం చేసుకుంది. వీకెండ్ వరకు పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, వీకెండ్ తర్వాత థియేటర్స్ రెంట్స్ కూడా రీకవర్ అవ్వడం కష్టం లాగా తయారైంది పరిస్థితి. సినిమాకు పాజిటివ్ టాక్ లేకపోవడం వల్లే ఇదంతా. అయితే అన్ని ప్రాంతాలు ఒకలా ఉంటే, సీడెడ్ ప్రాంతం మాత్రం మరోలా ఉంది. ఇక్కడ మాత్రం ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. నాల్గవ రోజు ఈ చిత్రానికి సీడెడ్ ప్రాంతం నుండి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఐదవ రోజున కూడా అదే రేంజ్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నాలుగు రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి నాలుగు రోజులకు గాను 15 కోట్ల 9 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 9 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే నేటితో ఈ చిత్రం పది కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టబోతుంది అన్నమాట. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే, ఈ ప్రాంతం నుండి నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి 4 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి 3 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2 కోట్ల 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 4 కోట్ల 82 లక్షల రుపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కృష్ణా జిల్లా నుండి 3 కోట్ల 12 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 2 కోట్ల 34 లక్షల రూపాయిలను రాబట్టింది.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి 4 కోట్ల 95 లక్షల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 92 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే పది కోట్ల రూపాయిల షేర్ కి మించి ఒక్క పైసా కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు.