corona Virus: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 16.000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. శాస్త్రవేత్తల పరిశోధనల్లో గుండెపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయని వెల్లడైంది. కరోనా వైరస్ గుండె లోపలి కణాలపై కూడా దాడి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాషింగ్టన్ యూనివర్సిటి స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంతమందిని గుండె సంబంధిత సమస్యలు వేధిస్తుండటం గమనార్హం. గుండె లోపలి కణాలను కరోనా వైరస్ చంపేస్తోందని ఫలితంగా గుండె సంకోచ వ్యాకోచాలపై తీవ్ర ప్రభావం పడుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో లక్షణాలు కనిపించకుండానే ఈ తరహా సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Also Read: జగ్గారెడ్డి, వీహెచ్ లో రేవంత్ పంచాయితీ ఏంటి?
కరోనా వైరస్ ఇమ్యూనిటీ పవర్ కు కారణమయ్యే టి, బి కణాలపై కూడా దాడి చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొందరిలో గుండె భిన్నంగా స్పందిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నెగిటివ్ వచ్చినా కరోనా వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏవైనా గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: మంత్రి మేకపాటి మరణంపై సోషల్ మీడియాలో వదంతులు.. అసలు ఏం జరిగింది?
Recommended Video: