దేశవ్యాప్తంగా చలి విజృంభిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత పడిపోవడంతో.. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా మారింది. అయితే తల్లి నుంచి తట్టుకునేందుకు చాలా మంది రక్షణ చర్యలు వాడుతున్నారు. ప్రత్యేకంగా కొన్ని వస్త్రాలు ధరించి పనులకు వెళ్తున్నారు. చలికాలంలో చన్నీటి స్నానం చేయాలంటే సాహసం చేయాల్సిందే. దీంతో చాలామంది వాటర్ హీటర్ లేదా గ్లీజర్ ద్వారా వేడి చేసిన నీటితో స్నానం చేస్తుంటారు. అయితే చలికాలంలో చలి నుంచి తట్టుకునేందుకు వేడి నీరు తో స్నానం చేయడం సభబే.. కానీ అత్యధికంగా వేడి ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే?
చలికాలంలో స్నానం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో చాలామంది వేడి నీటితో స్నానం చేయాలని అనుకుంటారు. అయితే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ అత్యధికంగా వేడి ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి తాత్కాలికంగా రిలీఫ్ అవుతుంది. రక్తనాళాలు విస్తరిస్తాయి. దీనివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. అయితే ఇదే సమయంలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రక్త ప్రసరణ ఎక్కువగా కావడంతో బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. దీంతో అకస్మాత్తుగా గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, బ్లడ్ ప్రెషర్ సమస్యలు ఉన్నవారు అత్యధికంగా వేడి ఉన్న నీటితో స్నానం చేయకపోవడమే మంచిది.
అలాగే చలికాలంలో తరచూ వేడి నీళ్లతో స్నానం చేసే వారి చర్మం పొడిబారిపోతుంది. వేడినీళ్లతో చర్మంపై ఉండే సహజ నూనెలో తొలగిపోతాయి. దీంతో స్కిన్ డ్రై గా మారుతుంది. ఇలా డ్రై గా ఉండడం వల్ల దురద ఎక్కువగా వస్తుంది. చర్మం పగలడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎగ్జిమా సమస్య ఉన్నవారు మరింతగా కష్టాలు పడాల్సి వస్తుంది.
కొంతమంది ప్రతిరోజూ తలపై స్నానం చేస్తారు. చలికాలంలో తలపై వేడి నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు మూలాలు బలహీనమవుతాయి. తలపై వేడి నీళ్లు పోయగానే స్కాల్స్ డ్రై అవుతుంది. ఇదే సమయంలో చుండ్రు పెరుగుతుంది. ఆ తర్వాత జుట్టు రాలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తలపై తరచూ స్నానం చేసేవారు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు.
నిద్రలేమి సమస్య ఉన్నవారు చలికాలంలో అత్యధిక వేడి నీటితో స్నానం చేయడం అంత మంచిది కాదు. అయితే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. చలికాలంలో చన్నీటి స్నానం కంటే గోరువెచ్చని నీటి వల్ల ఆరోగ్యకరంగా ఉండగలుగుతారు. అయితే ఈ నీటితో స్నానం కూడా ఎక్కువ సేపు చేయకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాల లోపు పూర్తి చేయాలి. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైసర్ తప్పనిసరిగా వాడాలి.