https://oktelugu.com/

Insomnia : నిద్రలేమికి తేనె మంచి మందులా పనిచేస్తుంది తెలుసా?

Insomnia : మనకు సహజసిద్ధమైన ఆహారాలతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ ఆహారాల్లో తేనె ఒకటి. దీంతో మనకు ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. పలు రోగాలకు తేనె మందులా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మన దేహానికి పలు సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు ఉంటే ఇట్లే పరిష్కారమవుతాయి. అలాంటి గుణం తేనెకు ఉంటుంది. అందుకే దీన్ని దివ్య ఔషధంగా చెబుతారు. వంద గ్రాముల తేనె తీసుకుంటే అందులో […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2023 5:16 pm
    Follow us on

    Insomnia : మనకు సహజసిద్ధమైన ఆహారాలతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ ఆహారాల్లో తేనె ఒకటి. దీంతో మనకు ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. పలు రోగాలకు తేనె మందులా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మన దేహానికి పలు సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు ఉంటే ఇట్లే పరిష్కారమవుతాయి. అలాంటి గుణం తేనెకు ఉంటుంది. అందుకే దీన్ని దివ్య ఔషధంగా చెబుతారు.

    వంద గ్రాముల తేనె తీసుకుంటే అందులో 317 గ్రాముల శక్తి లభిస్తుంది. దీంతో తేనెలో విటమిన్ ఎ, సిలతో పాటు కాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఉన్నాయి. కొవ్వులు సున్నా శాతమే. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. డయేరియాతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. కాలిన గాయాలను మాన్పుతుంది. అల్సర్లు, నొప్పులను తగ్గిస్తుంది.

    రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టని వారు ఓ స్పూన్ తేనె తాగితే మెదడుకు విశ్రాంతిగా ఉంటుంది. రాత్రి పూట తేనె తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రాత్రి గ్లాసుడు నీటిలో చెంచె తేనె వేసుకుని తాగడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. మంచి నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది. తేనె క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. శ్వాస సంబంధమైన రుగ్మతలను దూరం చేస్తుంది.

    తేనె వల్ల ఇన్ని రకాల లాభాలుండటం వల్ల దీన్ని తీసుకోవడం మంచిదే. చిన్న పిల్లలకు తేనె పెట్టకూడదు. పెద్దవారైతేనే తేనెను ఆహారంగా తీసుకోవాలి. తేనెను వేడి చేయకూడదు. ఒకవేళ వేడి చేస్తే అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. ఇలా తేనెను ఇన్ని రకాలుగా ఉపయోగించుకుని మన ఒంట్లోని రోగాలను దూరం చేసుకునేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.