https://oktelugu.com/

TS Liquor Shops: మందు బాబులకు మరో షాక్‌..

మే 11 సాయంత్రం 6 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే తాజాగా ఆ గడువును మరో 12 గంటలు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 13, 2024 10:36 am
    TS Liquor Shops

    TS Liquor Shops

    Follow us on

    TS Liquor Shops: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా మద్యం షాపులు మూసి ఉంటున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు మద్యం షాపులను అధికారులు మూసివేసి సీల్‌ వేశారు. దీంతో అప్రమత్తమైన మందుబాబులు శనివారమే తమకు కావాల్సిన మందు కొని పెట్టుకున్నారు. ఆదివారం మద్యం షాపులు పూర్తిగా మూసి ఉన్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కూడా మూసి ఉండనున్నాయి.

    మరో 12 గంటలు బంద్‌..
    మే 11 సాయంత్రం 6 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే తాజాగా ఆ గడువును మరో 12 గంటలు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అంటే మే 14వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవు.

    హైదరాబాద్‌ పరిధిలోనే..
    అయితే మందుబాబులకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. ఈ ఉత్తర్వులు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మాత్రమే అమలు అవుతాయి. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు కూడా వైన్స్‌ మూసివేయాలని ఈసీ సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో జూన్‌ 4వ తేదీన కూడా మద్యం షాపులూ మరోమారు మూత పడనున్నాయి.