https://oktelugu.com/

నడుము నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ జాగ్రత్తలతో సమస్యలకు చెక్!

ప్రస్తుత కాలంలో మనుషులను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. తినే ఆహారం, జీవనశైలి ఈ ఆరోగ్య సమస్యలలో ఎక్కువ సమస్యలకు కారణమవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువమంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటినుంచి విధులు నిర్వహించే వాళ్లలో చాలామందిని మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లలో మరి కొందరు ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం వల్ల భవిష్యత్తులో మధుమేహం, బీపీ, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 23, 2022 / 09:55 AM IST
    Follow us on

    ప్రస్తుత కాలంలో మనుషులను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. తినే ఆహారం, జీవనశైలి ఈ ఆరోగ్య సమస్యలలో ఎక్కువ సమస్యలకు కారణమవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువమంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటినుంచి విధులు నిర్వహించే వాళ్లలో చాలామందిని మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి.

    వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లలో మరి కొందరు ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం వల్ల భవిష్యత్తులో మధుమేహం, బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు అయితే ఉన్నాయి. కూర్చుని ఎక్కువ సమయం పని చేసే వాళ్లలో చాలామందిని బ్యాక్ పెయిన్ సమస్య వేధిస్తుంది. ఈ సమస్య బారిన పడిన వాళ్లలో కొంతమందికి మందులు వాడినా సమస్య మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.

    నడుము నొప్పితో బాధ పడేవాళ్లు ఆయుర్వేద మందులపై దృష్టి పెడితే మంచిది. ఆయుర్వేద మందులు నడుము నొప్పిపై ప్రభావవంతంగా పని చేస్తాయి. నడుమును నూనెతో మసాజ్ చేయడం ద్వారా నడుము నొప్పికి సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అదేపనిగా వర్క్ చేయకుండా మధ్యమధ్యలో అటూఇటూ తిరగడం ద్వారా కూడా నడుము నొప్పి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

    నిద్రపోయే సమయంలో తలకింద దిండు పెట్టుకోవడం ద్వారా కూడా నడుము నొప్పి సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా నడుము నొప్పి సమస్యను సులభంగా దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ చిట్కాలు పాటించినా సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.