https://oktelugu.com/

రోజుకు రూ.7 ఆదా చేస్తే రూ.60,000 పెన్షన్ పొందే ఛాన్స్.. ఎలా అంటే?

ప్రస్తుత కాలంలో డబ్బును పొదుపు చేయాలని భావించే వాళ్ల కొరకు ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడులను, ఊహించని స్థాయిలో రాబడులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత కూడా హామీతో కూడిన రాబడి పొందాలనుకునే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 2015 సంవత్సరం […]

Written By: Kusuma Aggunna, Updated On : January 23, 2022 9:59 am
Follow us on

ప్రస్తుత కాలంలో డబ్బును పొదుపు చేయాలని భావించే వాళ్ల కొరకు ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడులను, ఊహించని స్థాయిలో రాబడులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత కూడా హామీతో కూడిన రాబడి పొందాలనుకునే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

2015 సంవత్సరం మే నెల 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ వల్ల అసంఘటిత రంగంలోని ఉద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. దేశంలో ప్రస్తుతం 3.68 కోట్ల మంది ఈ స్కీమ్ లో ఉన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. కొన్ని వందల మంది ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.

మెరుగైన రిటైర్మెంట్ కావాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు ఈ స్కీమ్ లో రోజుకు 7 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే నెలకు 5,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. https://enps.nsdl.com/enps/nationalpensionsystem.html వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ లో చేరవచ్చు.

ఓటీపీ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో చేరేవాళ్లు వ్యక్తిగత, ఆధార్ కార్డ్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు అని చెప్పవచ్చు.