Corona Virus: గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఒమిక్రాన్ ప్రాణాంతకం కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో హిమాలయాలలో ఉన్న ఒక మొక్క కరోనాకు సులభంగా చెక్ పెడుతుందని తేలింది.
ప్రపంచ దేశాలు కరోనా వైరస్ వల్ల భయాందోళనకు గురవుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు ప్రజలకు తీపికబురు అందించారు. ఫైటో కెమికల్స్ ను కలిగి ఉన్న ఒక మొక్క సులభంగా కరోనాను కట్టడి చేస్తుందని శాస్త్రవేత్తలు అన్నారు. హిమాలయాలలో మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మూలికలు ఉన్నాయి. ఆ మూలికలలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా తెలుస్తోంది.
Also Read: భర్త పోయాక వివాహిత మెట్టెలు, గాజులు తీసివేయడం వెనకున్న కారణం తెలుసా..?
హిమాలయాల్లో మాత్రమే లభ్యమవుతున్న రోడోడెండ్రాన్ అర్బోరియం అనే మొక్కలో కరోనాకు చెక్ పెట్టే ఫైటో కెమికల్స్ ఉన్నాయి. బయోమాలిక్యులార్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ జర్నల్లో ఈ మొక్కకు సంబంధించి తాజాగా ఒక అధ్యయనం ప్రచురితమైంది. స్థానిక ప్రజలు ఈ మొక్కను బురాన్ష్ అని పిలుస్తారని సమాచారం. ఈ మొక్కల్లో ఉండే ఆయుర్వేద ఔషధం శరీర కణాల్లోని వైరస్ ను అడ్డుకుంటుంది.
శాస్త్రవేత్తలు ఈ మొక్కపై మరిన్ని ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నారు. ఈ మొక్క సహాయంతో భవిష్యత్తులో కరోనాకు సులువుగా చెక్ పెట్టవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. శాస్త్రవేత్తలు బురాన్ష్ ను కొన్ని ఔషధ మూలికలలో కూడా వాడుతున్నారు. కరోనాకు కరోనా వ్యాక్సిన్లతో పాటు ఇతర వైద్య విధానాలు అందుబాటులోకి వస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.
Also Read: పక్కరాష్ట్రంలో పీవీపీ రౌడీయిజం.. ఏం ధైర్యం రాజా నీది?