spot_img
Homeహెల్త్‌High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా...

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొన్నింటి మిశ్రమం ద్వారా ఇంట్లోనే విటమిన్లు, ఖనిజాలు అందించే ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పదార్థాలలో ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్ గా తీసుకుంటే శరీరానికి ప్రోటీన్లు అందించడమే కాకుండా అనవసరపు కొవ్వు పేరుకు పోకుండా ఉంటుంది. ఇంతకీ దీనిని ఎలా తయారు చేసుకోవాలి? అసలు ఏంటిది?

మనం కిచెన్ గదితోపాటు మార్కెట్లో తరచుగా ఎండు బఠానీలను చూస్తూ ఉంటాం. వీటికి మరికొన్ని పదార్థాలను కలిపి తింటే పోషకాహారం అవుతుంది అని కొందరు ఆహార పదార్థాలు తయారు చేసే నిపుణులు పేర్కొంటున్నారు. ఎండు బఠానీలు, పల్లీలు, మొక్కజొన్న గింజలు ఒక్కో కప్పుతో తీసుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మూడు పచ్చిమిర్చి, తగినంత అల్లం తురుము, కొద్దిగా పసుపు, ఉప్పు పదార్థాలను దగ్గర ఉంచుకోవాలి.

ఎండు బఠానీలతో పాటు పల్లీలను ముందుగా నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల ఉడికించడానికి సులభం అవుతుంది. బఠానీలు మెత్తగా మారిన తరువాత మొక్కజొన్న గింజలతో కలిసి కుక్కర్ లో వేసి ఉడికించాలి. ఆ తరువాత ఒక్ పాన్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తరువాత ఆవాలు, జీలకర్ర వేయించాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు వేసి మిశ్రమం చేయాలి. ఇప్పుడు ఉడికించిన పల్లీలు, బఠానీలు, మొక్కజొన్న గింజలను ఇందులో వేసి కలపాలి. ఇలా మూడు నిమిషాల పాటు తాలింపు చేయాలి.

చివరలో కాస్త నిమ్మరసం వేసి రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఒక పాత్రలో వేసుకొని తింటే చాలా రుగా ఉంటుంది. ఈ పదార్థం రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యం కూడా అందిస్తుంది. బఠానీల్లో ప్రోటీన్, మొక్కజొన్నల్లో కార్బోహైడ్రేట్ల వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బయట లభించే ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ కంటే ఇవి ఎంతో ఆరోగ్యకరం.

అయితే వీటిని తీసుకునే క్రమంలో ఆరోగ్య రక్షణలు పాటించాలి. ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తీసుకోవాలి. గ్యాస్, అజీర్ణ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండడమే మంచిది. అలాగే లివర్ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తీసుకోవడం అంతమంచిది కాదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper