
మనలో చాలామందిని ఏదో ఒక సమయంలో విరేచనాల సమస్య వేధిస్తుంది. తీసుకునే ఆహారంలో ఏ మాత్రం మార్పు వచ్చినా ఈ సమస్య వేధించే అవకాశాలు ఉంటాయి. చాలామంది విరేచనాలు తగ్గడానికి ట్యాబ్లెట్స్ పై ఆధారపడుతూ ఉంటారు. కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా సులభంగా విరేచనాలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. సహజ పద్ధతుల ద్వారా సులభంగా విరేచనాలను తగ్గించుకోవడం సాధ్యమవుతుంది.
ఎండిన అల్లం పొడి ఒక టీ స్పూన్ తీసుకొని తేనె, దాల్చిన చెక్క, జీలకర్ర పొడిని కొద్ది మొత్తంలో తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. బాగా మగ్గిన అరటిపండును లేదా అరటిపండు, పెరుగు మిశ్రమాన్ని కలిపి తీసుకుంటే కూడా విరేచనాల సమస్యకు చెక్ పెట్టవచ్చు. గోరువెచ్చని నీటిలో పసుపు వేసుకుని కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది. గడ్డ పెరుగు తీసుకుంటే పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల విరేచనాలకు చెక్ పెట్టవచ్చు.
అరటి పండు లేదా పెరుగులో దాల్చిన చెక్క పొడి వేసి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనె, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలు పాటించినా సమస్య తగ్గకపోతే మాత్రం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని మందులు వాడాలి. సహజ పద్ధతుల ద్వారానే విరేచనాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.
విరేచనాలతో బాధ పడుతున్న సమయంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.