https://oktelugu.com/

Father: తండ్రి నుంచి నేర్చుకొనే 8 ముఖ్యమైన పాఠాలివీ

సమస్యల్లేని జీవితం ఉండదు. ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఉన్నప్పుడే ముందుకు సాగుతాం. అయితే మనం పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు అది మరణశాసనమే అవుతుంది. అంటే ప్రతీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. దాని కోసం వెతికే ప్రయత్నం చేయాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 19, 2023 / 12:16 PM IST

    Father

    Follow us on

    Father: అనురాగానికి ప్రతి రూపం నాన్న.. ప్రతీ వ్యక్తి జన్మకు రక్ష నాన్న.. వెలకట్టలేని త్యాగాలెన్నో చేసి తన బిడ్డల భవిష్యత్తే లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగే నాన్న చల్లని మనసుతో కుటుంబ బాధ్యతను మోస్తాడు. జన్మించిన ప్రతి వ్యక్తికి జీవిత రక్షణనిస్తూ వెన్నంటూ నడిపించే ఏకైక హీరో నాన్న మాత్రమే. తండ్రి నుంచి వారసత్వం అంటే చాలా మంది.. ఆస్తులు.. అంతస్తులు అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ విలువైన సలహాలు, సూచనలు నాన్న మాత్రమే ఇస్తారు. తన జీవితంలోని అనుభవాలను బిడ్డలతో పంచుకుంటూ వారి జన్మ సార్థకం చేసేందుకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాంటి నాన్న నుంచి ఎంత నేర్చకున్న తక్కువే. అయితే తండ్రి నుంచి నేర్చుకోవాల్సిన 8 ముఖ్యమైన పాఠాల గురించి తెలుసుకుందాం.

    ఇష్టానికి వదిలేయండి..
    జీవితంలో మనకున్న అరుదైన అవకాశం స్వేచ్ఛ. తన కుమారుడు ఎన్ని తప్పులు చేసినా వాటిని సర్చి చేసుకుంటూ పోతూ సరైన మార్గంలో తండ్రి నడిపిస్తూ ఉంటాడు. ఈ సమయంలో తన ఇష్టానికి పూర్తిగా వదిలేస్తారు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినప్పుడే వారి ఆలోచనలు మెరుగుపడుతాయని చాలా మంది నమ్ముతారు. అందువల్ల తమకిష్టమైన పనులు చేసినప్పుడు ఏ తండ్రి అడ్డు చెప్పకపోవడమే మంచిది.అయితే తప్పుడు పనుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తెలపారు.

    స్వేచ్ఛకు అవకాశం ఇవ్వాలి..
    ఒక టేబుల్ పై స్క్రూను బిగించినప్పుడు అది టైట్ కాగానే వదిలేయాలి. అలాగని బలవంతం చేస్తే చెక్క విరిగిపోయే అవకాశం ఉంది. అలాగే పిల్లల మనసు ఒక స్థాయి వరకు మాత్రమే కష్టపెట్టి.. ఆ తరువాత వారి ఇష్టానికి వదిలేయడబ బెటర్ అని చాలా మంది తండ్రులు ఆలోచిస్తారు. అలా ఆలోచించబట్టే చాలా మంది ఈరోజుల్లో మేధావులు తయారయ్యారు.

    సమస్య పరిష్కారానికి ఎన్నో దారులు..
    సమస్యల్లేని జీవితం ఉండదు. ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఉన్నప్పుడే ముందుకు సాగుతాం. అయితే మనం పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు అది మరణశాసనమే అవుతుంది. అంటే ప్రతీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. దాని కోసం వెతికే ప్రయత్నం చేయాలి.

    భయం వీడాలి..
    మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు భయాన్ని వీడాలి. భయం మనిషిని ఏ పని చేయనివ్వదు. అయితే ఆ పని తప్పుడు పనా.. లేక అనైతికమైనదా అనే విషయంలో భయం ఉండాలి. ఇలాంటి విషయాలు ఒక తండ్రి మాత్రమే తన కొడుకుకు చెప్పగలడు.

    అనుగుణంగా ఉండే దుస్తులను వేసుకోండి..
    మనసు ప్రశాంతంగా ఉండడానికి కన్వినెంట్ దుస్తులను ధరించాలి. ఇలా అనుగుణంగా ఉన్న దుస్తులు వేసుకోవడం ద్వారా ఏ పని చేయడానికైనా సౌకర్యంగా ఉంటుంది. చిన్నవయసులో స్కూలుకెళ్లే సమయంలోనే తండ్రి చెప్పే మాటలివి.

    హెడ్ లైట్ ఆన్ చేయాలి..
    మనం బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్ లైట్ ఎంతో ముఖ్యం. ఇది వేయడం ద్వారా ముందుకు వెళ్లే దారి కనిపిస్తుంది. ఇది జీవితానికి కూడా వర్తిస్తుంది. మనసు అనే హెడ్ లైట్ కు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఆలోచనలు పెరిగి అందమైన జీవితం కనిపిస్తుంది.

    ప్రయత్నించి.. నియంత్రించవద్దు..
    జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని దాటే క్రమంలో నిరాశ చెందవద్దు. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నాలను నియంత్రించాలి అనే ఆలోచన వస్తే జీవితం అక్కడే ఆగిపోతుంది.

    కొత్త పరిచయాలు పెంచుకోవాలి..
    ఒంటరితనం నరకం లాంటిది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలివిడిగా ఉండడం వల్ల శరీరం, మనసు ఉల్లాసంగా మారుతుంది. ఇక కొత్త పరిచయాలు పెంచుకోవడం వల్ల తెలివి పెరుగుతుంది. అందువల్ల కొత్త పరిచయాలను పెంచుకోవడంలో ఏమాత్రం తడబడడానికి ఆస్కారం ఇవ్వకూడదు.