Hearing Problems : ఎవరో మాట్లాడుతున్నట్లు చెవిలో అనిపిస్తుందా? ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

కొందరికి ఏదో ఒక సమయంలో పక్కన పెడితే.. పక్కన ఎవరూ లేకపోయిన నిరంతరంగా కూడా చెవిలో ఎవరో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఇలా అనిపించేవారు వేరే సమస్యతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇంతకీ ఆ సమస్య ఏంటి? ఇలా చెవిలో వినిపించడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 24, 2024 2:01 pm

Hearing Problems

Follow us on

Hearing Problems :  ప్రతి మనిషికి శరీర భాగాల్లో చెవులు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే చెవులు లేకపోతే ఎవరు ఎం చెప్పిన వినలేరు. కొన్నిసార్లు వినబడకపోవడమే మంచిది అనుకుంటారు. ఎందుకంటే ఎదుటి వారు ఎంత తిట్టుకున్న కూడా వినిపించకపోతే ఎలాంటి గొడవలు ఉండవని భావిస్తారు. అయితే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి చెవులు అనేవి చాలా ఇంపార్ట్‌టెంట్. మానవుని శరీర భాగాల్లో చెవి చాలా సున్నితమైనది. అయితే కొందరికి చెవిలో ఎలెర్జీ, ఇన్ఫెక్షన్ అవుతుంది. దీంతో చాలా బాధను అనుభవిస్తారు. స్నానం చేసేటప్పుడు వాటర్ ఎక్కువగా ఉండిపోవడం, చలి, నిద్రపోయేటప్పుడు చెవి లోపలికి ఏదో కీటకం వెళ్లడం వంటి కారణాల వల్ల చెవి నుంచి ఏదో శబ్దంలా అనిపిస్తుంది. లేకపోతే ఎవరో ఒకరు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇలా జరిగిన ఒక రోజు కాస్త టెన్షన్ పడతారు. ఆ తర్వాత సాధారణమే అని కొందరు వదిలేస్తారు. చెవి నుంచి వాటర్ అవి వెళ్లిపోతే ఇలా ఉండదులే అని భావిస్తారు. కానీ ఇలా వదిలేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే చెవి నుంచి అలా శబ్ధం రావడం, ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించడం వల్ల అనారోగ్య బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. కొందరికి ఏదో ఒక సమయంలో పక్కన పెడితే.. పక్కన ఎవరూ లేకపోయిన నిరంతరంగా కూడా చెవిలో ఎవరో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఇలా అనిపించేవారు వేరే సమస్యతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇంతకీ ఆ సమస్య ఏంటి? ఇలా చెవిలో వినిపించడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇంద్రియాలు అనేవి ప్రతి మనిషికి ముఖ్యమే. ఇవి ఒక్క నిమిషం పనిచేయకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది. అయితే కొందరికి చెవిలో ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇలా ఏదో ఒక్కసారి అనిపించడం కాకుండా నిరంతరంగా అనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం.. ఊహించుకోవడం వల్ల జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీనిని స్కిజోఫ్రెనియా అని అంటారు. ఈ వ్యాధి బారిన పడినవారికి ఎల్లప్పుడూ.. ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించడం, చెవిలో ఏదో ఉన్నట్లు భయబ్రాంతులకు గురవడం వల్ల జరుగుతుంది. దీనివల్ల పక్కన ఎవరు లేకపోయిన, వినిపించకపోయిన అలా జరగుతుందని నిపుణులు అంటున్నారు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేకపోతే ఈ సమస్య ఇంకా తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదడుకి సరిగ్గా రక్తప్రసరణ జరగకపోవడం వల్ల బలహీనంగా మారుతుంది. దీనివల్ల ఈ ఎవరూ మాట్లాడకపోయిన వినిపించడం వంటివి జరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య చాలా డేంజర్‌ అయిన , ఒకటి నుంచి రెండుసార్లు అనిపించిన తర్వాత వెంటనే వైద్యుని సంప్రదించాలని నిపుణులు అంటున్నారు. లేకపోతే సమస్య ఇంకా తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.