Health Tips: ముక్క లేనిదే ముద్ద దిగని వారు ఎందరో ఉంటారు. ఒకప్పుడు ఇంటికి బంధువులు వస్తే లేదా ఏదైనా పండగలు ఉంటే మాత్రమే చికెన్, మటన్ ఇంటికి వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. వారానికి ఒకసారి ఏంటి వారానికి మూడు నాలుగు రోజులు ముక్క ఉండాల్సిందే. ఇక ముక్కతో పాటు చుక్క కూడా కావాలి. అదీ లేకుంటే కూల్ డ్రింక్స్ అయినా పక్కా ఉండాల్సిందే. లేదంటే అసలు కిక్ రాదు కదా. ఇలాంటి అలవాటు చాలా మందికి ఉండే ఉంటుంది. కానీ ఈ అలవాటు మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మరి ఎలా? ఎందుకు? ఏం జరుగుతుంది వంటి వివరాలు తెలుసుకుందామా?
చాలా మంది చికెన్, మటన్, బిర్యానీలు వంటివి తింటుంటే కచ్చితంగా కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. కూల్ డ్రింక్స్ లేకుండా ఈ స్పైసీ ఫుడ్ టేస్ట్ బాగుండదు అనుకుంటారు. నిజమే మీకు ఈ కాంబినేషన్ అంటే ఇష్టమే కావచ్చు. కానీ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కదా అంటున్నారు నిపుణులు. ఈ కాంబినేషన్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఈ కాంబినేషన్ వల్ల ఆహారం జీర్ణం అవుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇందులో అసలు నిజం లేదట. పైగా అనారోగ్యం కూడా.
Also Read: బిర్యానీని తినడం మానకండి.. ఎందుకంటే?
కూల్ డ్రింక్స్ వల్ల జరిగే కార్పొనేషన్ జీర్ణ క్రియకను దెబ్బతీస్తుందట. ఇందులోని అధిక చక్కెర బరువును పెంచుతుంది. జీర్ణక్రియ సమస్యల వల్ల మరింత ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. జీర్ణ సమస్యలు, కడుపు సమస్యలు, గ్యాస్ వంటి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక బరువును పెంచే ఈ కాంబినేషన్ ను దూరంగా ఉంచడమే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాఫ్ట్ డ్రింక్స్ లో కార్బన్ డయాక్సైడ్, అధిక చక్కెర కంటెంట్ ఉంటాయి. బిర్యానీలో ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు ఉండటం వల్ల ఇది కూడా ఆమ్లంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట అంతరాన్ని నిర్వహించకుండా రెండింటినీ తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్లత స్థాయిలు పెరుగుతాయి.
చక్కెర అధికంగా ఉండే భారీ ఆహారాలు తీసుకునేటప్పుడు శీతల పానీయాలను నివారించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కార్బోనేటేడ్ పానీయాలు ఉబ్బరం, జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. బదులుగా, కార్బోనేటేడ్ కాని పానీయాలు తీసుకునే ముందు బిర్యానీ తిన్న తర్వాత ఒక గంట వేచి ఉండటం మంచిది.
Also Read: తేనె ఎందుకు పాడవదు? దీనికి ఎండ్ డేట్ ఎందుకు ఉండదు?
మీకు కచ్చితంగా బిర్యానీతో కూల్ డ్రింక్ తాగాలి అనిపిస్తే ఈ అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర డ్రింక్స్ ను ఫ్రిఫర్ చేయండి. ముఖ్యంగా మజ్జిగ, పుదీనా రసం, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి వాటిని ఎంచుకోండి. ఇవి మీ ఆరోగ్యానికి మరింత ప్రయోజనాలను చేకూరుస్తాయి. సో ఇక నుంచి అయినా మీ అలవాటును కాస్త దూరం పెట్టి ఆరోగ్యం గురించి ఆలోచించి మీ నిర్ణయాన్ని మార్చేసుకోండి. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. టేక్ కేర్.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.