Forgot your bag on the bus: బస్సు ప్రయాణం చేసే సమయంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి దూర ప్రయాణం చేసేటప్పుడు కావలసిన లగేజ్ ని తీసుకెళ్తూ ఉంటాం. కానీ బస్సులో ఎవరైనా పరిచయస్తులు కలవగానే వారితో మాట్లాడుతూ ఉంటాం. ఇలా మాటల్లో పడి బ్యాగు లేదా ఇతర లగేజ్ ని మర్చిపోయి బస్సు దిగిపోతాం. ఇలా లగేజీ మర్చిపోయిన తర్వాత చాలామంది వాటిని వదిలేసుకున్న వారు ఉన్నారు. మరికొందరు బస్సు వెంబడే పరిగెత్తి బ్యాగులు కలెక్ట్ చేసుకున్నవారు ఉన్నారు. అయితే ప్రస్తుతం చిన్న ట్రిక్ ద్వారా లగేజీని సేఫ్ గా తిరిగి తీసుకునే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రంగంలో దీనిని వాడేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లోనూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో మాన్యువల్ గా టికెట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రింట్ టికెట్ ఇస్తున్నారు. ప్రతి బస్సులో ఇప్పుడు టికెట్ మిషన్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ టికెట్ పై అన్ని రకాల వివరాలు ఉంటున్నాయి. ఎంత దూరం నుంచి ఎంత దూరం వరకు ప్రయాణం చేస్తున్నారు? చార్జీలు ఎంత? దీనిపై జిఎస్టి ఎంత? అనే పూర్తి వివరాలు నమోదు అవుతున్నాయి.
అలాగే ఇదే టికెట్ పై డ్రైవర్, కండక్టర్ కోడ్ కూడా ఉంటుంది. అంటే మనం బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఆ బస్సును ఎవరు డ్రైవ్ చేశారు? ఎవరు టికెట్ ఇచ్చారు? అనే వివరాలు కూడా ఉంటున్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో మనకు వారి గురించి తెలుసుకోవడానికి ఈజీగా మారింది. కండక్టర్ కు సంబంధించిన కోడ్ ఎంట్రీ చేస్తే అతని వివరాలు డిస్ప్లే అవుతాయి.
Also Read: పెళ్లి అయినా ఆరు నెలలకే గొడవలు మొదలయ్యాయా? ఏంటి బాస్ ఇది?
ఇలాంటి సమయంలో బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఏదైనా లగేజ్ మర్చిపోయి బస్సు దిగితే.. దానిని వెంటనే రికవరీ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బయలుదేరిన సమయంలో ఆ బస్సులో లగేజ్ మర్చిపోయి దిగారని అనుకుందాం. సాధారణంగా అయితే దానిని మళ్లీ రికవరీ చేసుకోవడానికి ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు ఇలా చేస్తే చాలు..
తెలంగాణలోని వారు అయితే TS RTC 040 69440000…AP RTC అయితే 08662570005/149 అనే నెంబర్ కి కాల్ చేసి టికెట్ పై ఉన్న కండక్టర్ లేదా డ్రైవర్ కోడ్ చెప్పాలి. ఈ కోడ్ చెప్పగానే వారు వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను ప్రయాణికులకు ఇస్తారు. అయితే టికెట్ ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇలా నెంబర్ ఇవ్వగానే వారికి ఫోన్ చేసి తమ లగేజ్ గురించి వివరించాలి. ఒకవేళ నెక్స్ట్ స్టేషన్ ఉంటే అక్కడ లగేజ్ స్టోర్ చేయమని కోరాలి. లేదా దగ్గర్లోనే ఉంటే వెంటనే వెళ్లి లగేజ్ తీసుకొని అవకాశం ఉంటుంది.
Also Read: మనుషుల జీవితం నాశనం కావడానికి కారణం ఎవరో తెలుసా?
అయితే దూర ప్రయాణాలు చేసేవారు సైతం ఇలా తమ బ్యాగులను మర్చిపోయినా రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల పై నెంబర్లను గుర్తుపెట్టుకోవడం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.