Health Tips: ప్రతి రోజు అధిక ఒత్తిడి కారణంగా చాలామందికి అలా పడుకోగానే నిద్ర పడుతుంది. కానీ మరికొందరిలో మాత్రం మరుసటి రోజు పనులను తలుచుకుంటూ మరింత ఒత్తిడికిలోనై తీవ్ర నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా నిద్రలేమి సమస్యతో బాధపడటం వల్ల ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి.మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ పానీయం తాగితే చాలు ఎంతో ప్రశాంతంగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని ఆవుపాలలో కాస్త బాదం పొడి కలుపుకొని తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇందులో ఉన్న ట్రిప్టోఫాన్ రక్తంలో సెరటోనిన్ స్థాయులను పెంచడం వల్ల ప్రశాంతమైన నిద్రకు కారణం అవుతుంది.
పూర్వ కాలంలో జలుబు దగ్గు సమస్యలతో బాధపడే వారికి చామంతి టీ ఇచ్చేవారు. దీనిని తాగటం వల్ల దగ్గు జలుబు సమస్య నుంచి విముక్తి పొందడమే కాకుండా ప్రశాంతమైన నిద్రను కల్పిస్తుంది. చామంతి టీలో ఉన్న గుణాలు మనలో ఉన్నటువంటి ఒత్తిడిని దూరం చేస్తాయి.
ఆయుర్వేదంలో నిద్రలేమి సమస్యకు ఉపయోగించే వాటిలో అశ్వగంధం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాలలో ఈ అశ్వగంధ పొడిని కలుపుకుని తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. వీటితో పాటు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆల్మండ్ బనానా బటర్ స్మూతీ లను త్రాగటం ఎంతో మంచిది. ఇందులో ఉన్నటువంటి
మెగ్నీషియం, మెలటోనిన్ సుఖనిద్రని అందించడానికి దోహదపడతాయి.కనుక ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ పానీయాలను తాగడం వల్ల సుఖ నిద్ర పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.