
Health Fact: మనం తీసుకునే ఆహారాలతోనే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. మంచి ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇతర ఆహారాలు తీసుకుంటే మరోలా ఉంటాయి. దీంతో మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈనేపథ్యంలో పండ్లు మన ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. పండ్లు రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే విటమిన్లు, లవణాలు, ఖనిజాలు, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. పండ్లు తినే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా పడితే అలా తినడం అంత సురక్షితం కాదు. రాత్రి పూట మనం తీసుకునే ఆహారంలో ఏ పండ్లు తినకూడదదో తెలుసుకుని నడుచుకోవడం వల్ల మనకు ఇబ్బందులు తలెత్తవు.
Also Read: Spring Onion Benefits: ఉల్లికాడలను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అరటి పండుతో..
పండ్లలో అరటిపండు మంచి ప్రొటీన్లు ఉన్న పండే. ఇందులో ఉండే పోషకాల వల్ల మనకు మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది. కానీ రాత్రి సమయంలో అరటిపండు తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి అరటి పండు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావు. అరటిపండు తొందరగా జీర్ణం అవుతుంది. అందుకే వీటి మధ్య సంబంధం కుదరదు. అందుకే డిన్నర్ లో అరటిపండు తీసుకోకూడదని చెబుతున్నారు.
యాపిల్ తింటే..
యాపిల్ ను తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇందులో ఉండే ఆక్ట్రాలిక్ యాసిడ్ మనం తిన్న ఆహారం జీర్ణం కాకుండా నిరోధిస్తుంది. దీంతో ఎసిడిటీ గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల యాపిల్ ను రాత్రి సమయంలో తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా సపోటా కూడా అంత సురక్షితం కాదు. సపోటాలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. దీని వల్ల షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది. అందుకే రాత్రి పూట సపోటాలను తినకూడదు.

సిట్రస్ ఫ్రూట్స్ వల్ల..
ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. నారింజ, ద్రాక్ష, ఫైనాపిల్ వంటి వాటిలో ఆమ్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. వీటిని రాత్రి సమయంలో తినడం వల్ల కడుపులో గ్యాస్ ఎసిడిటి వంటి సమస్యలు వస్తాయి. దీంతో గుండె దడ పెరుగుతుంది. సరిగా నిద్ర పట్టకుండా చేసే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని కూడా తీసుకోవద్దు. ఇలా రాత్రి సమయంలో పండ్లు తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఏర్పడటంతో ఆరోగ్య రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జాగ్రత్త సుమా?
ఇలా రాత్రి భోజనంలో పండ్లు తీసుకోవడం అంత మంచిది కాదు. వీటితో ఆరోగ్యం కంటే అనారోగ్యమే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో మనం రాత్రి సమయంలో పండ్ల కంటే డ్రైఫ్రూట్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం సురక్షితం. ఖర్జూరాలు, ద్రాక్షలు, బదం, పిస్తా వంటి వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ నేపథ్యంలో రాత్రి పూట మనం చేసే డిన్నర్ బాగుంటేనే మనకు మంచి ఆరోగ్యం సిద్ధించడం ఖాయం.
Also Read:Ananya Nagella’s Instagram photos : జాకెట్ వేసుకోకుండా మొత్తం విప్పి చూపించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్