No Smoking Day 2022: స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ వ్యాధులు వస్తాయట!

No Smoking Day 2022: ఈ మధ్య కాలంలో దేశంలో స్మోకింగ్ చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కొంతమంది మాత్రం ఈ అలవాటును మానలేకపోతున్నామని చెబుతున్నారు. మన దేశంలోని జనాభాలో 12 కోట్ల మంది సిగరెట్ తాగుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. సిగరెట్లు తాగడం వల్ల బ్రాంకైటిస్, నిమోనియా, ఎంఫిసెమా, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది. సిగరెట్లు ఎక్కువగా తాగితే మహిళల్లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు […]

Written By: Kusuma Aggunna, Updated On : March 9, 2022 5:37 pm
Follow us on

No Smoking Day 2022: ఈ మధ్య కాలంలో దేశంలో స్మోకింగ్ చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కొంతమంది మాత్రం ఈ అలవాటును మానలేకపోతున్నామని చెబుతున్నారు. మన దేశంలోని జనాభాలో 12 కోట్ల మంది సిగరెట్ తాగుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. సిగరెట్లు తాగడం వల్ల బ్రాంకైటిస్, నిమోనియా, ఎంఫిసెమా, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.

No Smoking Day 2022

సిగరెట్లు ఎక్కువగా తాగితే మహిళల్లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సిగరెట్ అలవాటు ఉన్నవాళ్లలో రక్తనాళాలు సంకోచిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిగరెట్ అలవాటు పురుషులలో లైంగిక సమస్యలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ధూమపానం వల్ల వేర్వేరు ఆరోగ్య సమస్యల బారిన పడి ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రజలు మృతి చెందుతున్నారు.

Also Read: ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదలకు కేసీఆర్ రెడీయేనా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధూమపానం గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తే మంచిదని ప్రజలు కోరుకుంటున్నారు. ధూమపానం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ప్రజల్లో ధూమపానం గురించి మరింత ఎక్కువగా అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన లేకపోతే మాత్రం ఆరోగ్యం విషయంలో నష్టాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మోకర్లలో మన దేశంలోనే 12 శాతం మంది ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Also Read: ముందస్తు కోసమే కేసీఆర్ నిరుద్యోగులకు వరాలు ప్రకటించారా?