Curd Side Effects: రాత్రిపూట పెరుగు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ ప్రమాదకరమైన సమస్యలు!

Curd Side Effects: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా ఎండలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాతావరణం మారిన నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో కూడా కీలక మార్పులు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో చాలామంది మజ్జిగ, పెరుగు తినడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పెరుగు, మజ్జిగ కొలెస్ట్రాల్, బరువు తగ్గించడంలో ఎంతగానో […]

Written By: Kusuma Aggunna, Updated On : March 8, 2022 12:31 pm
Follow us on

Curd Side Effects: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా ఎండలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాతావరణం మారిన నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో కూడా కీలక మార్పులు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో చాలామంది మజ్జిగ, పెరుగు తినడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే.

Curd Side Effects

పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పెరుగు, మజ్జిగ కొలెస్ట్రాల్, బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముకలను బలంగా చేయడంతో పాటు అసిడిటీకి చెక్ పెడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో పెరుగు తోడ్పడుతుంది. ఆయుర్వేదంలో కూడా పెరుగుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే రాత్రి సమయంలో పెరుగును తీసుకునే వాళ్లు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

Also Read: చివరకు క్రిస్టియన్లకూ ఏపీలో అసంతృప్తియేనా?

ఏవైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటే వాళ్లు పెరుగుకు దూరంగా ఉంటే మంచిది. మాంసాహారం తీసుకునే సమయంలో పెరుగును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. పండ్లు ఎక్కువగా తినేవాళ్లు సైతం పెరుగుకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. పెరుగుతో పోలిస్తే మజ్జిగ ఆరోగ్యానికి ప్రయోజనకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

బరువు తగ్గాలని భావించే వాళ్లు పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. రోగనిరోధకశక్తిని పెంచడంలో పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. పెరుగు రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో తేమ శాతం తగ్గే అవకాశం ఉండదు.

Also Read: మోడీ వ్యూహాలు రాష్ట్రాల్లో పనిచేయవా?