White Hair: జుట్టు తెల్లబడటం అనేది సర్వసాధారణంగా అవుతున్న సమస్య. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధ పడుతున్నారు. ఎవరిని చూసిన రంగులు వేస్తూ కనిపిస్తున్నారు. కానీ దీని వల్ల సమస్యలు కూడా రావచ్చు. పాతికేండ్లు నిండకుండానే జుట్టు నెరిసిపోవడం సమస్యనే. సరైన పోషకాలు, విటమిన్లు లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఇక ఈ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
ఇక జుట్టు నెరవడం అంటే హృద్రోగానికి సంకేతం అంటారు నిపుణులు. ఈజిప్ట్ లోని కైరో యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందట. ఇందులో ఏకంగా 545 మందిని ఎంపిక చేశారు. వాళ్ల ఆరోగ్యం, జుట్టు రంగు ఆధారంగా పరిశీలించారు నిపుణులు. అందరికీ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారట. పదేండ్ల పాటు వీళ్లను గమనించి తెల్ల జుట్టు ఉన్నవారిలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు తెలుసుకున్నారట.
జుట్టు నల్లగా ఉన్నవారిలో ఇలాంటి సమస్యలు అరుదుగా ఉండటం గమనించారు నిపుణులు. తెల్లజుట్టు ఉన్నవారు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కాబట్టి ఇలాంటి వారు కొలెస్ట్రాల్ పరీక్షలు కూడా చేయించుకోవాలి అని తెలిపారు. అంతేకాదు ఇలా రాకుండా ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మరి మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధ పడుకుండా ఉండాలంటే మీ ఆరోగ్యం, ఆహారం మీద శ్రద్ధ పెట్టండి.