Hakini Mudra: ఈ రోజుల్లో చాలా మంది యోగా అనేది చేస్తుంటారు. కొందరికి సమయం లేక ఏదైనా పని చేస్తూ కూడా యోగా చేస్తుంటారు. అందులో పవర్ ఫుల్ ముద్ర హకిని (Hakini). ఇది ధ్యాన సమయంలో చేసే పవిత్రమైన చేతి సంజ్ఞ. దీనిని బ్రెయిన్ పవర్ ముద్ర (Brain Power Mudra) లేదా ముద్ర ఫర్ ది మైండ్ అని కూడా అంటారు. ఈ ముద్ర వేయడం వల్ల చాలా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. వీటితో పాటు మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా జీవితంలో ప్రతీ విషయాన్ని కూడా హ్యాండిల్ చేయగలరని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ హకిని ముద్ర బాగా వైరల్ అవుతోంది. ఎలాన్ మస్క్ వంటి వారు ఎక్కువగా ఈ ముద్ర వేయడంతో చాలా వైరల్ అవుతోంది. ఈ ముద్రకు మూడవ కన్ను దేవత హకిని పేరు పెట్టారు. అయితే ఈ హకిని ముద్ర వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
కూర్చొన్నప్పుడు లేదా ఏదైనా పని చేసేటప్పుడు చేతులో హకిని ముద్రను వేయడం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ముద్ర చాలా పవర్ ఫుల్. దీన్ని వేయడం వల్ల ఒత్తిడి వంటి సమస్యలు క్లియర్ అవుతాయి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మానసిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. రోజూ ఒక 30 నిమిషాలు ఈ ముద్రను వేయడం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా తయారు అవుతుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. అయితే దీన్ని సరైన పద్ధతిలో చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. లేకపోతే ఎలాంటి ప్రయోజనాలు కూడా ఉండవు. ఈ ముద్రను వేసే ముందు సరైన భంగిమలో కూర్చోని చేయాలని నిపుణులు అంటున్నారు.
ఈ హకిని ముద్రను వేసే ముందు వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. మీకు కంఫర్ట్ ఉన్న సిట్టింగ్‌లో కూర్చోని.. అరచేతులను మీ ఛాతీ ముందు ఒకచోట పెట్టుకోవాలి. ఆ తర్వాత చేతివేళ్లను ఎదురుగా ఉంచి వాటి వేళ్లను తాకాలి. లోతుగా ఊపిరి పీల్చుకుంటూ.. కళ్లు మూసుకుని ఈ హకిని ముద్ర వేయాలి. దీని వల్ల మెరుగైన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. వీటివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే శ్వాస కోశ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.