https://oktelugu.com/

జుట్టు ఎక్కువగా రాలుతోందా.. చేయకూడని పొరపాట్లు ఇవే..?

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వాళ్లను జుట్టు సమస్యలు వేధిస్తున్నాయి. ముఖానికి కళ తెచ్చే జుట్టు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు పడక తప్పదు. రోజువారీగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలకుండా చేయవచ్చు. మనలో చాలామంది జుట్టు మృదువుగా, మెరుపుగా అవుతుందని భావించి ఎక్కువ సమయం తలను దువ్వుతూ ఉంటారు. Also Read: కిడ్నీల్లో రాళ్ళతో బాధ పడుతున్నారా.. తినకూడని ఆహారాలివే..? తలను ఎక్కువసార్లు దువ్వటం వల్ల జుట్టు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 3, 2021 / 12:37 PM IST
    Follow us on

    ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వాళ్లను జుట్టు సమస్యలు వేధిస్తున్నాయి. ముఖానికి కళ తెచ్చే జుట్టు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు పడక తప్పదు. రోజువారీగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలకుండా చేయవచ్చు. మనలో చాలామంది జుట్టు మృదువుగా, మెరుపుగా అవుతుందని భావించి ఎక్కువ సమయం తలను దువ్వుతూ ఉంటారు.

    Also Read: కిడ్నీల్లో రాళ్ళతో బాధ పడుతున్నారా.. తినకూడని ఆహారాలివే..?

    తలను ఎక్కువసార్లు దువ్వటం వల్ల జుట్టు కుదుళ్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. జుట్టు దువ్వటానికి హెయిర్‌ టైప్‌ని బట్టి దువ్వెనను ఎంచుకోవాలి. పళ్ళు వెడల్పుగా ఉన్న దువ్వెనను, రౌండ్‌ బ్రీజిల్స్‌ ఉన్న దువ్వెనను వాడితే జుట్టు రాలే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి కొంతమంది జుట్టు కొసలు చిట్లడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. పొడుగు జుట్టు ఉన్నవాళ్లను ఎక్కువగా ఈ సమస్య వేధిస్తుంది.

    Also Read: అల్లం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

    హెయిర్ కట్ ను ఎక్కువ రోజులు వాయిదా వేస్తే జుట్టు డ్రైగా కావడంతో పాటు జుట్టు కొసలు చిట్లుతాయి. వెంట్రుకలు చిట్లాక నూనెలను, షాంపూలను ఉపయోగించినా పెద్దగా ఫలితం ఉండదు. మనలో చాలామంది జుట్టుకు కొబ్బరి నూనెను రాసుకోవడానికి ఆసక్తి చూపరు. అయితే జుట్టుకు నూనె పెట్టుకుంటే మాత్రమే పోషణ లభిస్తుంది. జుట్టుకు కొబ్బరినూనె రాయడం ద్వారా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    కొబ్బరి నూనెను వాడటం ఇష్టం లేకపోతే నువ్వుల నూనె, ఆలివ్‌ ఆయిల్ లను ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు. తలస్నానం చేసే ముందు తలకు నూనె పెట్టడం వల్ల జుట్టుకు రక్షణ కవచం ఏర్పడుతుంది. జుట్టు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.