Hair Care Tips: ప్రెగ్నెన్సీ తర్వాత మహిళలను కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్న సంగతి తెలిసిందే. అలా మహిళలను వేధిస్తున్న సమస్యలలో జుట్టు రాలడం కూడా ఒకటి. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సరైన ఆహారంను తీసుకోవడం ద్వారా జుట్టు సంబంధిత సమస్యలకు మహిళలు చెక్ పెట్టవచ్చు. ప్రెగ్నెన్సీ తర్వాత మహిళలను వేధించే సమస్యలలో ఈ సమస్య కూడా ఒకటి.
బలంగా లాగడం, కట్టడం చేయడం వల్ల జుట్టుపై ఊహించని స్థాయిలో ఒత్తిడి పడటంతో పాటు జుట్టు రాలిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రెగ్నెన్సీ తర్వాత శరీరానికి విటమిన్ సప్లిమెంట్లు అవసరం కాగా శక్తిని అందించడంలో విటమిన్ సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. విటమిన్ బి, విటమిన్ సి తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జుట్టును పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
చాలామంది జుట్టుకు రంగు వేయడం, పెర్మ్ చేయడం, స్ట్రెయిట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో జుట్టు రాలే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎంతో అవసరమైతే తప్ప జుట్టును స్ట్రెయిట్ చేయడం, పెర్మ్ చేయడం, రంగు వేయడం చేయవద్దని నిపుణులు చెబుతుండటం గమనార్హం.
Also Read: జుట్టు ఎక్కువగా రాలుతోందా.. చేయకూడని పొరపాట్లు ఇవే..?