Postal Jobs: భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. , కేరళ సర్కిల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 95 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. https://www.indiapost.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అర్హులు కాగా ఇతర ఉద్యోగ ఖాళీలకు 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు అని చెప్పవచ్చు. దరఖాస్తులను ది అసిస్టెంట్ డైరెక్టర్ (రిక్రూట్‌మెంట్), ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్, కేరళ సర్కిల్, తిరువనంతపురం – 695033 అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు, క్రీడార్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని చెప్పవచ్చు. https://www.keralapost.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: ఐవోసీఎల్ లో 1968 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?