Habits: ప్రస్తుతం చాలా మంది కొత్త జీవనశైలికి అలవాటు పడుతున్నారు. ఎక్కువగా ఆందోళనకు (Stress) గురి కావడం, మొబైల్ (Mobile) ఎక్కువగా చూడటం వంటి కారణాల వల్ల మెదడు బాగా దెబ్బతింటుంది. చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్ (Fast Food) తినడం, సరిగ్గా నిద్రపోకపోవడం (Sleepless), చక్కెర (Sugar) అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం వంటి కారణాల వల్ల మెదడు పనితీరు తగ్గిపోతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఎక్కువగా ఉండే వాటిని తినాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కొందరి జీవనశైలి వల్ల మెదడు పూర్తిగా దెబ్బతింటుంది. మరి ఎలాంటి అలవాట్లు ఉంటే మెదడు పూర్తిగా దెబ్బతింటుందో ఈ స్టోరీలో చూద్దాం.
నిద్రలేమి
బాడీకి సరిపడా నిద్ర లేకపోతే మెదడు పనితీరు పూర్తిగా తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి సమస్యలు, దృష్టిని తగ్గించడం, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు తక్కువగా నిద్రపోయే అలవాటు ఉంటే మాత్రం కాస్త ఎక్కువగా నిద్రపోండి. దీనివల్ల మీకు మెదడు పనితీరు మెరుగుపడుతుంది. రోజూ ఒకే సమయానికి 7-9 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. పడుకునే ముందు స్క్రీన్ చూడకుండా ఉంటే నాణ్యమైన నిద్ర పడుతుంది.
ఒత్తిడి
నిరంతరంగా ఒత్తిడికి గురైతే మాత్రం మెదడు పనితీరు తగ్గిపోతుంది. కాబట్టి చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురి కావద్దు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా వ్యాయామం వంటివి చేయాలి. ఒంటరిగా ఎక్కువగా కూర్చోకుండా అందరితో కలిసి సమయం గడపండి. కొత్త విషయాలు నేర్చుకోండి.
ధూమపానం
ధూమపానం సేవించడం వల్ల మెదడు పనితీరు తగ్గిపోతుంది. వీటి వల్ల స్ట్రోక్, డిమెన్షియా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ధూమపానం సేవించకండి. దీనివల్ల మీరు ఆలోచించే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది.
స్క్రీన్ సమయం
కొందరు ఎక్కువగా మొబైల్ వంటివి చూస్తుంటారు. వీటివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అలాగే మెదడు పనితీరు తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువగా స్క్రీన్ చూడవద్దు. రోజులో కొంత సమయం స్క్రీన్ చూడటానికి సమయం పెట్టుకోండి. దీనివల్ల కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
వ్యాయామం
పూర్తిగా నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా యోగా వంటివి లేకపోతే మెదడు పనితీరు తగ్గిపోతుంది. కాబట్టి రోజుకి కనీసం 30 నిమిషాలు అయిన నడవడం చేయండి. దీనివల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. రోజులో ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక గంట పాటు వ్యాయామం, యోగా వంటి వాటిపై ఇంట్రెస్ట్ పెట్టండి. దీనివల్ల మెదడుతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.