https://oktelugu.com/

Guava: రోజుకు ఒక ఆపిల్ కాదు జామ కాయ తింటే కూడా సరిపోతుంది.. ఎందుకంటే?

విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కేలరీలు, పొటాషియంలు జామపండ్లలో ఉంటాయి. అందుకే దీనిని ప్రతిరోజూ తినాలి. రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జామపండు విటమిన్ సి కి ప్రసిద్ధి చెందింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 7, 2024 / 01:00 AM IST

    Guava

    Follow us on

    Guava: పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ తింటే.. పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాంటి మంచి పండ్లలో జామ పండు ముందు వరుసలో ఉంటుంది. వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. రుచి పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా జామ చాలా మంచిది. రోజుకో జామ పండు తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఇప్పుడే మార్కెట్ వెళ్లి జామ పండ్లను తెచ్చుకుంటారు. మరి అవేంటో ఓ సారి చదివేసేయండి.

    విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కేలరీలు, పొటాషియంలు జామపండ్లలో ఉంటాయి. అందుకే దీనిని ప్రతిరోజూ తినాలి. రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జామపండు విటమిన్ సి కి ప్రసిద్ధి చెందింది. ఇందులో నారింజ కంటే 2 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది అంటున్నారు నిపుణులు. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, వ్యాధులు, అంటువ్యాధుల నుంచి రక్షించడంలో విటమిన్ సి ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి జామకాయను రోజు తీసుకోవాలి.

    డయాబెటిస్ చాలా మందిలో కనిపిస్తుంది. అందుకే ఈ జామకాయ తినడం వల్ల కాస్త డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనువైనది ఈ పండు. జామ ఆకు రసం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది.

    పొటాషియం, సోడియం అధికంగా ఉండే జామ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ అని పిలువబడే హెచ్డిఎల్ స్థాయిలను పెంచుతుంది. బరువు అదుపులో ఉంటుంది కూడా. జామకాయలో కేలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. అందుకే జీవక్రియను నియంత్రించి బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అధిక కేలరీల స్నాక్స్ ను తినడం కంటే ఈ జామకాయను మీ ఆహారంలో చేర్చడం వల్ల ప్రయోజనాలు కూడా మెండే ఉంటాయి అంటున్నారు నిపుణులు.

    జామకాయలో విటమిన్ బి6, విటమిన్ బి3 ఉంటాయి. కాబట్టి దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ అందుతుంది. నరాలు రిలాక్స్ అవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది జామకాయ. జామకాయలో కెరోటిన్, లైకోపీన్, విటమిన్ ఎ, విటమిన్ సి లు మెండు. ఇవి మన చర్మాన్ని దెబ్బతినకుండా రక్షిస్తాయి. ముడతలను తగ్గించి రంగును మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ సి పుట్టబోయే బిడ్డ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే ఫోలేట్ పిండం న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి తోడ్పడుతుంది.

    మహిళలకు రోజూ జామ ఆకు రసం తీసుకుంటే పీరియడ్స్ పెయిన్ ను తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని పెయిన్ రిలీవర్స్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది జామకాయ. జామపండులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని సహాయం చేస్తుంది. ఈ విటమిన్ పేలవమైన కంటి చూపును నివారించి కంటి చూపుకు హెల్ప్ అవుతుంది. మాక్యులర్ క్షీణత, కంటిశుక్లంతో సహా నష్టాల నుంచి కళ్ళను రక్షిస్తుంది.