Samosa Day : భారత దేశంలో సమోసా అంటే ఒక ఎమోషన్. సాయంత్రం అయితే అందరూ ఎక్కువగా తినడానికి ఇష్టపడే స్నాక్స్ లో సమోసా ఒకటి. ఇవి బేకరీ, టీ షాప్ లలో ఎక్కువగా దొరుకుతుంది. పిల్లలు అయితే సమోసాని చాలా ఇష్టంగా తింటారు. అయితే దేశంలో ఎన్నో రకాల సమోసాలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి వీటి పేర్లు మారుతాయి. ఈ సమోసాని మైదా లేదా గోధిమ పిండితో తయారు చేస్తారు. తినడానికి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఏదైనా కారం ఫుడ్ తినాలనిపించిన, వర్షం పడినప్పుడు తినాలనిపించిన సమోసా తినడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజుల్లో అయితే ఇంకా చాలా కొత్త ఫుడ్స్ వచ్చాయి. కానీ ఇప్పటికి కొందరి ఫేవరెట్ ఫుడ్ సమోసానే. అయితే ఈ సమోసా అసలు ఇండియాలోకి ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి ఈ సమోసా ఉందో మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రకరకాల పదార్థాలతో చేసే సమోసా మన దేశంలో అన్ని చోట్ల దొరుకుతుంది. ఏ సమయంలో అయిన ఈజీగా దొరుకుతుంది. ముఖ్యంగా సాయంత్రం పూట వేడి వేడిగా దొరుకుతుంది. అందరికీ ఇష్టమైన సమోసా పచ్చిమాసియా నుంచి ఇండియా కి వచ్చిందట. 11వ శతాబ్దంలో పర్షియాన్ చరిత్రకారుడు అబుల్ ఫజిల్ మొదటిగా తయారు చేసాడు. ఈ సమోసా ఆ దేశంలో సనూబాబాద్ గా పేరుతో ఉండేది. ఇండియా వచ్చిన తరువాత ఇది సమోసాగా మారింది. ఇండియాలో బీహార్, పశ్చిమ బెంగాల్ లో సమోసాని సింగడా అని పిలుస్తారు. వ్యాపారం కోసం భారత దేశానికీ వచ్చిన వర్తకులు వీటిని తీసుకు వచ్చేవారు. అలా ఇండియాలో సమోసా ఫేమస్ అయ్యింది. ఎక్కువగా జంతువులని మేపడానికి వెళ్లే వాళ్లు సమోసాను తీసుకెళ్తుంటారు. అయితే ఇందులో చాలా రకాల సమోసాలు ఉన్నాయి.
పశ్చిమాసియా నుంచి వచ్చిన సమోసాను ఇండియాలో మొదటిగా సగ్గుబియ్యం, బంగాళాదుంపలతో చేశారు. ఆ తరువాత వీటిని రకరకాల పదార్థాలతో తయారు చేస్తారు. ఇండియాలో బాగా ఉల్లి సమోసా, బంగాళాదుంప సమోసా ఫేమస్. అయితే సమోసాలో చాలా రకాలు ఉన్నాయి. ఉల్లి, బంగాళాదుంప, పనీర్, బిర్యానీ, నూడుల్స్, చోలే, జామ్, పాస్తా, చీజ్, జీడిపప్పు, పుట్టగొడుగు, చికెన్ వంటి రకాల సమోసాలు ఉన్నాయి. వీటితో గ్రీన్ చట్నీని ఎక్కువగా తింటారు. మన దేశంలో సమోసాకి మంచి మార్కెట్ ఉంది. ఈ సమోసా వ్యాపారం చేసేవాళ్లు ఎక్కువ లాభాలు కూడా పొందుతున్నారు. దీని ఖరీదు కూడా సామాన్య మనుషులు కొనే విధంగానే ఉంటుంది. అయితే ఇతర దేశం నుంచి వచ్చిన ఈ సమోసాకి కూడా ఒక రోజు ఉంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచ సమోసా రోజుని జరుపుకుంటారు. మరి మీరు సమోసాను ఇష్టంగా తింటారా? లేదా? కామెంట్ చేయండి.