https://oktelugu.com/

Car Parking : కారు ఒకే చోట వారం రోజులు నిలిపి ఉంచితే ఏమవుతుంది? ఎంత నష్టం జరుగుతుంది?

కారు ఒకే చోట ఉండడం వల్ల టైర్లలో ప్లాట్ స్పాట్ ను కలిగిస్తుంది. అంటే కారు వెయిట్ టైర్లపై పడి అవి డ్యామేజ్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కొన్ని రోజుల పాటు ఒకే చోట నిలిపి, ఆ తరువాత డ్రైవ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు కారు డ్రైవ్ చేయకుండే ఇంజిన్ లోని సమస్యలు వస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 7, 2024 / 02:37 AM IST

    Car Parking

    Follow us on

    Car Parking :  ఈ మధ్య దాదాపు తమ ఇంట్లో ఓ కారు ఉండాలని అనుకుంటున్నారు. ఆఫీసు అవసరాలతో పాటు దూర ప్రయాణాలు చేయాలనుకున్న వారు సొంతంగా 4 వెహికల్ ఉండాలని చూస్తున్నారు. అయితే కారు కొనుగోలు చేయడం కంటే కారు వాడడం తెలిసి ఉండాలని అంటారు ఆటోమోబైల్ నిపుణులు. అంటే కొందరు కారును కొనుగోలు చేసిన తరువాత నెలల తరబడి ఒకే చోట ఉంచుతారు.దానిని పట్టించుకోరు. సాధారణంగా ఏ వస్తువైనా ఎక్కువగా వాడితే దాని కాల పరిమితి తగ్గుతుంది. కానీ కారును ఒకే చోట ఉంచుతూ, బయటకు తీయకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. రోజుకు కనీసం ఒక్కసారి అయినా కారును డ్రైవ్ చేయాలని అంటున్నారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఎలాంటి పార్ట్స్ పాడైపోతాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

    కారు కొనుగోలు చేసిన తరువాత కొంత మంది దానిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఆ వెహికల్ ను ఇంట్లోనే ఉంచుతారు. మరికొందరు కొన్ని కారణాల వల్ల కారును ఇంట్లోనే ఉంచాల్సి వస్తుంది. ఇలా ఒక్క చోట ఉండడం వల్ల కారులోని పార్ట్స్ ఆటోమేటిక్ గా డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా ఏసీ కారు అయితే ఇంజిన్ లో సమస్యలు వచ్చి మూవ్ కావడానికి కష్టమవుతుంది. ఇవే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా ఉంటాయి.

    కారు ఒకే చోట ఉండడం వల్ల టైర్లలో ప్లాట్ స్పాట్ ను కలిగిస్తుంది. అంటే కారు వెయిట్ టైర్లపై పడి అవి డ్యామేజ్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కొన్ని రోజుల పాటు ఒకే చోట నిలిపి, ఆ తరువాత డ్రైవ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు కారు డ్రైవ్ చేయకుండే ఇంజిన్ లోని సమస్యలు వస్తాయి. దీంతో భారీ నష్టం కలగవచ్చు. ఇంజిన్ లోని కూలెంట్, బ్రేక్ ప్లూయిడ్ వంటివి క్షీణించే అవకాశం ఉంది. వీటితో కారు పనిచేయకుండా మారుతుంది.

    కారు తేమ ప్రదేశంలో ఎక్కువ రోజులు నిలిపి ఉంచడం వల్ల పార్ట్స్ తుప్పు పట్టిపోయే అవకాశం ఉంది. కారులో ఉండే రబ్బరు, స్టీల్ వంటి పట్టీలు కూడా పగుళ్లు ఏర్పడుతాయి. వీటి ధరలు అధికంగా ఉంటాయి. అలాగే ఏసీ కారు అయితే ఎక్కువ రోజులు ఏసిని ఆన్ చేయకపోవడం వల్ల దాని సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారిగా రన్ చేసినప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కంటారు. ఏసీ సక్రమంగా లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

    అందువల్ల కారును ప్రతి రోజూ ఒక్కసారైనా బయటకు తీసే ఏర్పాటు చేసుకోవాలి. వీలు కాకపోతే ఇతరులకు అప్పగించాలి. ఒకే ప్రదేశంలో ఎక్కువ రోజులు ఉండం వల్ల ఒక్కోసారి కారు ఇంజిన్ పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో రూ. 2 నుంచి 4 లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంది. కారు కొనడం కాదు దానిని వాడడంతో జాగ్రత్తలు పాటించాలని ఆటోమోబైల్ నిపుణులు చెబుతున్నారు.