https://oktelugu.com/

Corona Booster Dose: కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కావాలా.. కాల్ చేయాల్సిన నంబర్ ఇదే!

Corona Booster Dose: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతిరోజూ రికార్డ్ స్థాయిలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. జలుబు, దగ్గుతో బాధపడే వాళ్లలో చాలామంది కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచితే కరోనా కేసుల సంఖ్య కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వాళ్లు సైతం వైరస్ బారిన పడుతుండటం గమనార్హం. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 1, 2022 / 03:14 PM IST
    Follow us on

    Corona Booster Dose: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతిరోజూ రికార్డ్ స్థాయిలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. జలుబు, దగ్గుతో బాధపడే వాళ్లలో చాలామంది కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచితే కరోనా కేసుల సంఖ్య కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

    Corona Booster Dose

    కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వాళ్లు సైతం వైరస్ బారిన పడుతుండటం గమనార్హం. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లలో వైరస్ తీవ్రత తక్కువగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కావాలని భావించే వాళ్లకు జీ.హెచ్.ఎం.సీ తీపికబురు అందించింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే బూస్టర్ డోస్ ను పొందే అవకాశాన్ని జీ.హెచ్.ఎం.సీ కల్పిస్తుండటం గమనార్హం.

    Also Read: Union Budget Of India 2022: నదుల అనుసంధానానికి కేంద్రం అడుగులు.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం..

    హైదరాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నివశించే వాళ్లు 040 2111 1111 నంబర్ కు కాల్ చేయడం ద్వారా బూస్టర్ డోస్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే అందరూ ఈ విధంగా బూస్టర్ డోస్ ను పొందలేరు. అనారోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు, 60 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు బూస్టర్ డోస్ ను జీ.హెచ్.ఎం.సీ హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయడం ద్వారా తీసుకోవచ్చు.

    కాల్ చేసిన వాళ్ల ఇంటికి జీ.హెచ్.ఎం.సీ సిబ్బంది వచ్చి బూస్టర్ డోస్ ను అందజేస్తారు. మొబైల్ వాహనంలో వచ్చి సిబ్బంది వ్యాక్సిన్ ను వేస్తారు. ఇప్పటివరకు బూస్టర్ డోస్ ను వేయించుకోని వాళ్లు ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. జీ.హెచ్.ఎం.సీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హైదరాబాద్ ప్రజలు ప్రశంసిస్తున్నారు.

    Also Read: Union Budget Of India 2022: అసలైన విషయాలపై కేంద్రానికి సోయిలేదు.. బడ్జెట్‌పై కేసీఆర్ ఫైర్..